అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్ టాక్

అన్నపూర్ణ ఫోటో స్టూడియో.. ఇచ్చట అందంగా ఫోటోలు తీయబడును అనే క్యాప్షన్ తో సినిమా రాబోతోంది. యూ ట్యూబ్ లో 21వెడ్స్ 30 అనే వెబ్ సిరీస్ తో ఫేమ్ అయిన చైతన్య రావు, లావణ్య జంటగా నటించిన సినిమా.

ఇందుకు ముందు పిట్టగోడ అనే సినిమా తీసిన చందు ముద్దు డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని పెళ్లి చూపులు, దొరసాని చిత్రాలు నిర్మించిన యశ్ రంగినేని నిర్మించాడు. 90స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

ఇంతకు ముందే వచ్చిన టీజర్ ఓ మోస్తరుగా అనిపించుకుంది. అయితే పాటలు మాత్రం ఆ కాలానికి తగ్గట్టుగా ఆకట్టుకునేలా అనిపించాయి. ఇక ఈ ట్రైలర్ చూస్తే ట్రైలర్ లో వాళ్లు చెప్పినంత బిల్డప్ ఏం కనిపించడం లేదు. ఓ సాధారణ కథలానే కనిపిస్తోంది. అయితే దీనికి దర్శకుడు తనదైన శైలి ట్రీట్మెంట్ తో మెప్పించే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. అప్పట్లో ఫోటోస్టూడియోస్ వారికి ఓ రేంజ్ లో క్రేజ్ ఉండేది. అందుకే ఆ కాలం ఆడియన్స్ కు ఈ మూవీ కనెక్ట్ అవుతుందేమో కానీ.. ట్రైలర్ లో మాత్రం మేం సినిమాలో కామెడీ, యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్ చూపించబోతున్నాం అనే కంటెంట్ కనిపిస్తోంది. బట్ మూవీకి సంబంధించి ఈ ట్రైలర్ ఏ మాత్రం ఆసక్తిని పెంచలేకపోయింది.

తీసేది ఆ కాలం కథే అయినా చూసేవారిలో ఈ కాలం ఆడియన్స్ కూడా ఉన్నారు కాబట్టి.. వారిని కూడా అట్రాక్ట్‌ చేసేలా ఈ ట్రైలర్ లో ఏదైనా ఉందా అంటే అస్సలు లేదు అనే చెప్పాలి. అనౌన్స్ మెంట్ లో అప్పట్లో రిక్షాపై సినిమాల గురించి చెప్పినట్టుగా ఉంది. ఇది అవుట్ డేటెడ్ అనలేం కానీ.. వెరీ రొటీన్. ట్రైలర్ లో చూపిన సన్నివేశాలు, డైలాగ్స్, వాళ్లు చెబుతున్నంత క్యూరియాసిటీ లేదు.


ఒక ఊరికి చెందిన ఫోటోగ్రాఫర్.. అదే ఊరి అమ్మాయిని ప్రేమిచండం.. తర్వాత మరో అమ్మాయితో లవ్ లో పడటం.. అటుపై జాతక దోషాలు, ప్రాణగండాలు అంటూ కథకు వేరే టర్న్ ఇచ్చారు. అయితే తనున్న పరిస్థితిలో వేరే ఆప్షన్ లేదంటూ హీరో ఏకంగా చనిపోవడానికి ప్రయత్నించడం అనే పాయింట్ కాస్త ఆసక్తిగా ఉంది. మొత్తంగా అన్నపూర్ణ ఫోటో స్టూడియో అంటూ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తూ వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ ఆ రేంజ్ ఆసక్తిని మాత్రం కలిగించలేకపోయిందనే చెప్పాలి.

Related Posts