యానిమల్ ఎందుకు వాయిదా పడింది.. ?

రణ్‌బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తోన్న సినిమా ‘యానిమల్’. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న విడుదల చేస్తాం అని ఆ మధ్య ప్రకటించారు. అయితే లేటెస్ట్ గా ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారు.

ఆగస్ట్ నుంచి డిసెంబర్ కు వాయిదా పడింది. అయితే ఈ మూవీ పోస్ట్ పోన్ కావడానికి ప్రధాన కారణం ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కాలేదు అని చెబుతున్నారు. దీంతో పాటు ఇంకా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని కూడా అంటున్నారు. బట్ అది నిజం కాదు అనేది బాలీవుడ్ నుంచి వినిపిస్తోన్న వార్త.

ఈ సినిమా షూటింగ్ ముగిసిపోయింది. చాలా రోజుల క్రితమే రష్మిక మందన్నా షూటింగ్ అయిపోయిందంటూ ఎమోషనల్ గా ఓ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో పెట్టింది. మరోవైపు ఆ మధ్య విడుదల చేసిన గ్లింప్స్ బావున్నా.. కాపీ అంటూ సందీప్ రెడ్డి పై చాలా కమెంట్స్ వచ్చాయి. ఇవన్నీ కాక మరో ప్రధాన విషయం వల్లే ఈ చిత్రం వాయిదా పడిందంటున్నారు.


అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ టాలీవుడ్ లో ఓవర్ నైట్ ఫేమ్ అయ్యాడు. ఇక్కడ ఆఫర్స్ ఉన్నా కాదని.. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడా ఓవర్ నైట్ ఫేమ అయ్యాడు. ఆ ఫేమ్ వల్లే నెక్ట్స్ మూవీకే రన్ బీర్ కపూర్ డేట్స్ వచ్చాయి. సో ఇప్పుడీ క్రేజ్ ను ప్యాన్ ఇండియన్ లెవల్లో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు సందీప్.

బట్ ఆగస్ట్ 11న వస్తే అది సాధ్యం కాదు. ప్రస్తుతం ప్యాన్ ఇండియన్ మార్కెట్ అంటే తెలుగు, తమిళ్ ను ప్రధానంగా చూస్తున్నారు. ఇలా చూస్తే అదే టైమ్ కు తెలుగులో మెగాస్టార్ భోళా శంకర్ ఉంది. ఈ మూవీని కాదని రణ్‌బీర్- సందీప్ ల యానిమల్ కు ఓపెనింగ్స్ వస్తాయి అనేది అసాధ్యం. ఒకవేళ భోళా శంకర్ కు హిట్ టాక్ వస్తే ఇక యానిమల్ బోన్ లోకే వెళుతుంది.

సో.. తెలుగు నుంచి భోళా ఓ పెద్ద ఆటంకంగా ఉంది. ఇక తమిళ్ కు వస్తే సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ ఉంది. సూపర్ స్టార్ మూవీకి కోలీవుడ్ లోనే కాదు. టాలీవుడ్ లో కూడా తిరుగులేని క్రేజ్ ఉంటుంది. అంటే ఈ యానిమల్ కు ఆగస్ట్ 11న కోలీవుడ్ లో కూడా షాక్ తప్పదు. అందుకే ఆలోచించి మరీ ఈ పోస్ట్ పోన్ నిర్ణయం తీసుకున్నారు అనేది బాలీవుడ్ టాక్.


ఓ రకంగా చెబితే రణ్ బీర్ కపూర్ కు తెలుగుతో పాటు తమిళ్ లో కూడా కేవలం మల్టీప్లెక్స్ లో మాత్రమే క్రేజ్ ఉంటుంది. దాన్ని దాటి.. ప్రమోషన్స్ చేసి.. సందీప్ రెడ్డి అనే దర్శకుడు ప్యాన్ ఇండియన్ రేంజ్ లో హిట్ కొట్టాలంటే ఇలా కాస్త నిదానంగా ఆలోచించి వస్తేనే అతనికీ, ఆ సినిమాకూ మంచిది.

Related Posts