నితిన్ నుంచి ఈ సడెన్ అప్డేట్ ఎందుకు

చడీ చప్పుడు లేని సినిమాలను ఆడియన్స్ పట్టించుకోవడం మానేశారు. ఒకప్పుడు ఆరాలు తీసి మరీ ఆయా సినిమాల అప్డేట్స్ ను గురించి తెలుసుకునేవారు. బట్ ఇప్పుడా పరిస్థితి లేదు. మేకర్స్ ఏదైనా అప్డేట్ ఇస్తే చూస్తున్నారు. అంతే. అందుకే వీళ్లు ఎప్పటికప్పుడు ఏదో రకంగా తమ సినిమాలకు సంబంధించిన న్యూస్ లను విడుదల చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలకే ఈ పరిస్థితి ఉంటే ఇక మీడియం రేంజ్ హీరోల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

కొన్నాళ్ల క్రితం ప్రారంభమైన నితిన్ – వక్కంతం వంశీ సినిమాకు సంబంధించి ఇలాగే జరిగింది. ఈ మూవీకి సంబంధించి ఏ అప్డేట్ లేకపోవడంతో ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా వదిలేశారు. అసలు షూటింగ్ జరుగుతుందా లేదా అనేది కూడా చాలామందికి తెలియదు. దీంతో కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ఆగిపోయింది అనే న్యూస్ వచ్చాయి. అప్పుడే దర్శకుడు వక్కవంతం వంశీ రియాక్ట్ అయ్యాడు.

తన సినిమా 60 శాతానికి పైగా ఫస్ట్ హాఫ్‌ తో సహా పూర్తయిందని ట్వీట్ చేశాడు. అయినా ఆ న్యూస్ పెద్దగా ఆడియన్స్ లోకి వెళ్లలేదు. అందుకే సడెన్ గా ఇప్పుడు ఫస్ట్ లుక్ అంటూ హడావిడీ మొదలుపెట్టినట్టు భావిస్తున్నారు.


నితిన్ – వక్కంతం వంశీ కాంబోలో వస్తోన్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ ఆదివారం విడుదల చేయబోతున్నారు. ఈ లుక్ ఎలా ఉంటుందో కానీ ఈ చిత్రానికి జూనియర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ఎందుకంటే ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా నటించబోతున్నాడట. ఆ మేరకు డిఫరెంట్ గెటప్స్ కూడా ఉంటాయంటున్నారు. అయితే ఫైనల్ గా ఆ లుక్స్ తోనే ఓ మంచి ట్విస్ట్ ఉంటుందని టాక్. ఇక నితిన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.

Related Posts