బాలయ్య భగవంత్ కేసరి రిలీజ్ డేట్ ఫిక్స్

నందమూరి బాలకృష్ణ హీరోగ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న సినిమా భగవంత్ కేసరి. ప్యాన్ ఇండియన్ మూవీగా అన్ని భాషల్లో విడుదల కాబోతోన్న ఈ మూవీని దసరా బరిలో విడుదల చేస్తున్నాం అని గతంలోనే ప్రకటించారు. ఆ మేరకు అఫీషీయల్ డేట్ ను అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు.

ఈ మధ్యాహ్నం అదిరిపోయే అప్డేట్ తో వస్తున్నాం అని ఒకరోజు ముందే ప్రకటించిన టీమ్.. ఫ్యాన్స్ ను ఒక్కసారిగా అలెర్ట్ అయ్యేలా చేసింది. మరో టీజర్ లేదా ఇంకేదైనా అప్డేట్ వస్తుందేమో అనుకున్నారు. బట్ జస్ట్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశాం అని చెప్పారు.

అయితే దసరా బరిలో అంటే అంతా అక్టోబర్ 20న వస్తుందనుకున్నారు. కానీ ఒక రోజు ముందే అక్టోబర్ 19న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. రీసెంట్ గా విడుదల చేసిన భగవంత్ కేసరి టీజర్ తో ఒక్కసారిగా అంచనాలు మారిపోయాయి.

అనిల్ రావిపూడి ఈ సారి మరో మ్యాజిక్ చేయబోతున్నాడు అనిపించింది. బాలయ్య లుక్, మేకోవర్ అదిరిపోయాయి. శ్రీ లీల బాలయ్య కూతురుగా నటిస్తోన్న ఈ చిత్రంలో ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

అయితే ఈ మూవీతో పాటు తమిళ్ హీరో విజయ్ – లోకేష్‌ కనకరాజ్ కాంబోలో రూపొందిన లియో కూడా డబ్బింగ్ రూపంలో విడుదల కాబోతోంది. మరి మొదటి రోజు ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో కానీ.. ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల కాబోతోంది.

Related Posts