అర్థరాత్రి గ్లింప్స్.. శాడిజమేనా..

ఈ మధ్య క్రేజ్ ఉన్న సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కోసం ఆడియన్స్ తో ఆడుకోవడం మొదలైంది. రీసెంట్ గా సలార్ మూవీ టీజర్ తెల్లవారు జామున విడుదల చేశారు. ఆ టీజర్ కోసం అంత పొద్దున్నే లేచి అప్డేట్ ఇస్తూ అటు మీడియాతో పాటు ఇటు అభిమానులు కూడా నానా తంటాలు పడ్డారు.

ఇక వాళ్లే అతి అనుకుంటే ఇప్పుడు అరవబ్యాచ్ అంతకు మించిన అతితో రాబోతున్నారు. సూర్య హీరోగా శివ డైరెక్షన్ లో రూపొందుతోన్న కంగువ మూవీ గ్లింప్స్ ను ఈ అర్థరాత్రి 12. 01 గంటలకు విడుదల చేయబోతున్నారు. అంటే ఈ గ్లింప్స్ కోసం అర్థరాత్రి వరకూ వేచి చూడాలన్నమాట.


ఒక సినిమా గ్లింప్స్ కోసం అర్థరాత్రి దాకా చూడటం అంటే మరీ ఇది కాస్త ఓవర్ గా అనిపిస్తోందంటూ అభిమానులతో పాటు చాలామంది అనుకుంటున్నారు. ఆ టైమ్ లో నిద్రమత్తులో చూసినా సరిగా అర్థం కాదు. దీంతో గ్లింప్స్ కు సంబంధించిన కరెక్ట్ టాక్ బయటకు వచ్చేది ఉదయం తర్వాతే. మరి అప్పుడే విడుదల చేసుకోవచ్చు కదా అనిపిస్తోంది కదా.. ? కానీ అలా చేస్తే మా సినిమాకు ఇంత క్రేజ్ ఉందని ఇతర సినిమాలకు చెప్పడం ఎలా సాధ్యం అవుతుంది. ఆ క్రేజ్ ను చూపించే కదా బిజినెస్ లో లెక్కలు మారేది. ఏదేమైనా ఇదో రకం శాడిజంలా ఉంది తప్ప ప్రాపర్ అప్డేట్ లా మాత్రం లేదు అనే చెప్పాలి.


కంగువలో సూర్య ఐదు గెటప్స్ లో కనిపించబోతున్నాడు. అతని సరసన దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఇంకా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీని 2024 ఆరంభంలో విడుదల చేయబోతున్నారు.

Related Posts