టాలీవుడ్

రామ్ – బోయపాటి దసరా నుంచి ఎందుకు తప్పుకున్నారు..

బోయపాటి సినిమా అంటే ఊరమాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంటుంది. తన హీరోల రేంజ్ ను నెక్ట్స్ లెవెల్లో చూపిచండంలో అతని శైలి టాలీవుడ్ లో ఇంకెవరికీ లేదు. కంటెంట్ ఏదైనా.. కటౌట్ ఎవరైనా సరే అది బోయపాటి సినిమాగానే కనిపిస్తుంది.

కాకపోతే తన హీరోలనే తన స్టైల్ కు దగ్గరగా వచ్చేలా చేసుకుంటాడు. అందుకే బోయపాటితో సినిమా అంటే హీరోలు కూడా ఉత్సాహం చూపిస్తుంటారు. ప్రస్తుతం ఎవరూ ఊహించని విధంగా రామ్ తో సినిమా చేస్తున్నాడు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీని ముందుగా దసరా బరిలో విడుదల చేస్తాం అని ప్రకటించారు. ఆ మేరకు అంతా అక్టోబర్ 19 లేదా 20న వస్తుందని భావించారు. అయితే సడెన్ గా రిలీజ్ డేట్ మార్చారు.


రామ్, బోయపాటి సినిమాను అక్టోబర్ నుంచి ప్రీ పోన్ చేసి సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే చాలా వరకూ ఇది ఊహించిందే. కాకపోతే పోస్ట్ పోన్ అవుతుందనుకున్నారు అంతే. ఈ చిత్ర పోస్ట్ పోన్ కావడానికి ప్రధాన కారణం బాలకృష్ణ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా దసరా బరిలోనే అక్టోబర్ 20న విడుదల కాబోతోంది.

అదే టైమ్ కు తామూ వస్తే బావుండదు అనే కారణంతోనే రామ్ సినిమాను ముందే విడుదల చేస్తున్నారు. అంటే రామ్ బాలయ్యను ఢీ కొట్టే సత్తా లేనివాడా అనుకోవడానికి లేదు. అది కాదు ప్రధాన కారణం. బాలయ్య, బోయపాటి మధ్య మంచిబాండింగ్ ఉంటుంది కదా..? ఇలా ఒకేసారి తమ రెండు సినిమాలూ విడుదలైతే బిజెనెస్ కి ఇబ్బంది అవడంతో పాటు మీడియాలో కూడా దీన్ని బాలయ్య వర్సెస్ బోయపాటిగా చూపిస్తారు. ఆ క్లాష్ రాకుండా ఉండేదుకే ఇలా ఒకరు ముందే వస్తున్నారు. మరి బాలయ్య అంటే స్టార్ హీరో కాబట్టి తన డేట్ మార్చలేదు. సో.. రామ్ సినిమా ముందే విడదల కాబోతోంది.

Telugu 70mm

Recent Posts

సెట్స్ పై సందడి చేస్తున్న సినిమాల సంగతులు..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. అత్యంత భారీ బడ్జెట్ తో యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా ఇది.…

2 hours ago

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బయోగ్రఫీ

కొన్ని పేర్లకు ఓ వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి పేర్లలో నందమూరి తారకరామారావు ఒకటి. ఆ పేరును పెట్టుకుని..ఆయన మనవడిగా తెలుగు…

3 hours ago

Malayali Star In Mahesh-Rajamouli Movie?

Director Rajamouli's film with superstar Mahesh Babu is in the pre-production stage. Soon.. they will…

4 hours ago

Shankar Is Going To Give A Double Bang To Kamal

The film 'Indian 2', which was completely stopped. 'Indian 2', which is currently in the…

4 hours ago

‘Abbai’ Out Of Dasara for Babai

If Natasimham Balakrishna commits once, he will not listen to anyone. He doesn't care how…

4 hours ago

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

17 hours ago