శివోహం హీరో ఎవరు..

రాక్షసుడు సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు దర్శకుడు రమేష్‌ వర్మ. అంతకు ముందు అతను చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. రవితేజతో గతంలో చేసిన వీర డిజాస్టర్ అనిపించుకుంది. అయినా రవితేజకు అతనిపై నమ్మకం ఉంది. అందుకే రాక్షసుడు హిట్ కాగానే వెంటనే ఖిలాడీతో ఆఫర్ ఇచ్చాడు. మంచి కంటెంట్ ఉంది కానీ కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లేతో మరోసారి దెబ్బయిపోయాడు రమేష్‌ వర్మ. అయినా ధైర్యం సడలకుండా రాక్షసుడు2 అనే సినిమా చేయబోతున్నానని ప్రకటించాడు. మరి ఆ మూవీ ఏమైందో కానీ సడెన్ గా శివోహం అనే టైటిల్ తో సినిమా అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి తమిళ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన జ్ఞానవేల్ రాజా నిర్మించబోతుండటం విశేషం.


ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ తో పాటు టైటిల్ డిజైన్ కూడా బావుంది. ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి ఈ మూవీ హిందీలో రూపొందిన భూల్ భులైయ్యా 2 కు రీమేక్ అంటున్నారు.ఇది కూడా 2007లో వచ్చిన భూల్ భులైయ్యాకు సీక్వెల్. ఆ సీక్వెల్ నే వీళ్లు రీమేక్ చేస్తున్నారు అనే ప్రచారం ఉంది. అది నిజమా కాదా అనేది వాళ్లే చెప్పాలి. అయితే ఈ సినిమాలో నటించేది ఎవరు అంటూ కొత్త చర్చలు నడుస్తున్నాయి. వీళ్లు కేవలం పోస్టర్ మాత్రమే విడుదల చేశారు. పోస్టర్ లో టెక్నీషియన్స్ ఎవరు అనేది ఉంది. ఈ చిత్రం రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుందట. అందుకే ఇది భూల్ భులైయ్యా2కు రీమేక్ అంటున్నారు.


మొత్తంగా హీరో గురించిన న్యూస్ ఏదీ చెప్పలేదు కానీ.. టాలీవుడ్ లో మాత్రం కార్తికేయ చేస్తున్నాడు అనే టాక్ ఉంది. ప్రస్తుతం అతను నటించిన బెదురులంక 2012 ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత అతనే హీరో అని అనౌన్స్ చేస్తారంటున్నారు. మరి నిజంగా అతనేనా లేక మరో హీరో చేస్తున్నాడా అనేది త్వరలోనే తెలుస్తుంది.

Related Posts