అల్లు అర్జున్ మామను పట్టించుకోలేదే

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా నాగార్జున సాగర్ టూర్ వేశాడు. టూర్ అంటే రొటీర్ టూర్ కాదు. ఇన్ డైరెక్ట్ గా అందులో పొలిటికల్ యాంబిషన్స్ ఉన్నాయి. అఫ్‌ కోర్స్ అవి అల్లు అర్జున్ వి కాదు.అతని మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డివి. ఆయన కొన్నాళ్లుగా బిఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ కారణంగానే నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ ను ఆశిస్తున్నాడు.

అల్లుడు ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి.. టికెట్ ఇస్తే అతనితో ప్రచారం చేయించుకుని ఖచ్చితంగా గెలుస్తా అనే నమ్మకంతో ఉన్నాడు. ఇక నిన్న(సోమవారం) బిఆర్ఎస్ పార్టీ టికెట్స్ అనౌన్స్ చేస్తుందన్న విషయం అందరికీ ముందే తెలుసు. అందుకే ఆ ప్రకటనకు ముందు తన బలాన్ని చూపించాలనుకున్నాడు చంద్రశేఖర్ రెడ్డి. దీంతో తను సాగర్ లో కట్టిన ఓ కన్వెన్షనల్ సెంటర్ ను అల్లుడు ఐకన్ స్టార్ చేత ప్రారంభోత్సవం చేయించాడు.

దీనికి దారి పొడవునూ విపరీతమైన ఫ్లెక్సీలు కట్టించారు. జన సమీకరణ కూడా బాగానే జరిగింది. ఈ బలం చూసి తనకు టికెట్ ఇస్తారు అనే ఆశతో కనిపించాడు. కానీ కేసీఆర్ ముందు అవేం వర్కవుట్ కాలేదు. నిన్న ప్రకటించిన సీట్స్ లో ఆయన పేరు లేదు. దీంతో చంద్రశేఖర్ రెడ్డికి నిరాశ తప్పలేదు. ఈ నియోజకవర్గం నుంచి నోముల భగత్ కే మరోసారి అవకాశం ఇచ్చారు.

భగత్ తండ్రి దివంగత నోముల నర్సయ్య సిపిఎమ్ నుంచి అప్పటి టీఆర్ఎస్ లో చేరి గెలిచాడు. మధ్యలో చనిపోయాడు. ఆ టికెట్ ను ఆయన కొడుక్కి ఇచ్చాడు కేసీఆర్. ఇప్పుడు కూడా భగత్ కే ఇవ్వడంతో చంద్రశేఖర్ కు ఆశాభంగం అయింది. మరి ఈయన కూడా ఇతర నాయకుల్లా కాంగ్రెస్, బిజిపి వైపు చూసి బిఫామ్ తెచ్చుకుంటాడేమో చూడాలి.

Related Posts