గేమ్ ఛేంజర్ గురించి నా చేతిలో ఏం లేదు – దిల్ రాజు

గేమ్ ఛేంజర్ గురించి అప్డేట్స్ కావాలంటే నా చేతిలో ఏం లేదు .. ఈ మాట అన్నది స్వయంగా దిల్ రాజు.. అంటే నమ్ముతామా..? కానీ నమ్మాలి. ఎందుకంటే నిజంగానే అన్నాడు కాబట్టి. గాండీవధారి అర్జున మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన దిల్ రాజు.. వేదికపై మాట్లాడేముందు ఆడియన్స్ నుంచి పెద్ద కేకలు వచ్చాయి.

అంతే దిల్ రాజు ఆ కేకలకు అర్థం తెలుసుకున్నాడు. ” నాకు తెలుసు.. నేను రాంగనే మీరు అరిచారంటే గేమ్ ఛేంజర్ గురించే.. నాకు తెలవదా.. బట్ మన చేతిలో లేదు. డైరెక్టర్ గారు ఇచ్చినప్పుడే డీటెయిల్స్ బయటకు వస్తాయి. మనం ఏం చేయలేమమ్మా.. ” అంటూ ఆడిటోరియంలోని ప్రేక్షకులను ఉద్దేశించి దిల్ రాజు అన్న మాటలు సెన్సేషనల్ గా మారాయి.


దిల్ రాజు అంటే ఏ దర్శకుడైనా సరెండర్ కావాల్సిందే అంటారు. అలాంటి దిల్ రాజు ఈ మాటలు అన్నాడు అంటే శంకర్ ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఊహించుకోవచ్చు. అసలే భారీ బడ్జెట్ తో ప్రారంభమైందీ చిత్రం. దీనికి తోడు విపరీతంగా ఆలస్యం అవుతుంది. ఇటు సెట్స్ ఇప్పటికే పాడైపోయాయి అన్నారు. అలాగే ఆర్టిస్టుల డేట్స్ కూడా క్లాష్‌ అవుతాయి.

లేదా కొందరు వేర్వేరు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటారు. మళ్లీ వాళ్లందరినీ పట్టుకోవాలంటే తలకు మించిన పనిఅవుతుంది. అఫ్‌ కోర్స్ ఈ పని దిల్ రాజుకు పెద్ద విషయం కాదు. కానీ శంకర్ వ్యవహారమే చికాకుగా ఉందంటున్నారు.

అప్పటికీ అతన్ని బెదిరించేందుకు ఆ మధ్య శైలేష్ కొలనుతో ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా తీయించాడు. మరి శంకర్ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చిందో కానీ.. దిల్ రాజే ఈ మాట అన్న తర్వాత ఇక ఫ్యాన్స్ కూడా కామ్ గా అప్డేట్ వచ్చిన తర్వాతే సంబరాలు చేసుకుంటే బెటర్.

Related Posts