ఇండస్ట్రీలో ఏ చిన్న ఇష్యూ జరిగినా ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఏకి పడేస్తుంటాడు నట్టికుమార్.ప్రతిసారీ చిన్న సినిమాలు బ్రతకాలనే చెబుతుంటాడు. ఆ దిశగానే ఆయన పోరాటం కూడా ఉంటుంది. ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. అతను సి కళ్యాణ్ ప్యానెల్ లో ఉన్నాడు. ఇలాంటి సందర్భాల్లో నట్టి కుమార్ చాలా అగ్రెసివ్ గా ఉంటాడు. బట్ ఇంత కోలాహలంగా ఎన్నికలు జరుగుతుంటే అతను కనిపించడం లేదు.
ఇదే చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంశం ఏదైనా అనర్గళంగా మాట్లాడటం నట్టికుమార్ శైలి. సి కళ్యాణ్, దిల్ రాజు ప్యానెల్స్ మధ్య జనరల్ ఎన్నికలకు మించిన రచ్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందే ప్రెస్ మీట్స్ పెట్టి మరీ ఒకరినొకరు తిట్టుకున్నంత పనిచేశారు.
మేమే గెలుస్తాం అంటే మేమే గెలుస్తాం అనేసుకున్నారు. సీనియర్స్, యాక్టివ్ మెంబర్స్ మధ్య పోటీ ఇది అని చెప్పుకున్నారు. ఇక నట్టికుమార్ కూడా మొన్నటి వరకూ తమతో ఉన్న చదలవాడ శ్రీనివాసరావు దిల్ రాజు ప్యానల్ లోకి జంప్ కావడంతో అతన్ని తిట్టినంత పనిచేశాడు.
ఓ రకంగా సి కళ్యాణ్ ప్యానెల్ లోఅతని తర్వాత అంత నోరు ఉన్న వ్యక్తి నట్టి కుమార్. కానీ అతను ఎన్నికల వేళ సైలెంట్ గా ఉండటం చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నాడు. మరి కావాలనే సైలెంట్ గా ఉన్నాడా లేక సైలెంట్ గా ఏదైనా ఎన్నికల బాధ్యతలో ఉన్నాడా అనేది చూడాలి.
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…
Man of masses NTR's birthday.. Only two more days left. He is acting as Young…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…