బేబీ బ్యూటీ నెక్ట్స్ ఏదీ..

బేబీతో ఓవర్ నైట్ ఫేమ్ అయింది హీరోయిన్ వైష్ణవి చైతన్య. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు, యూ ట్యూబ్ షార్ట్ ఫిల్మ్‌స్, సిరీస్ లలో హీరోయిన్ పాత్రలూ చేసింది. కానీ బేబీలో చేసిన బోల్డ్ రోల్ తిరుగులేని క్రేజ్ తెచ్చింది. ఈ పాత్రను ఓ తెలుగు అమ్మాయి చేయడమే ఓ సాహసం. ఆ సాహసానికి తగ్గ ఫలితం సినిమా చూస్తోంది. ఇప్పటికే 92 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇంకా కొన్ని చోట్ల స్టడీగానే ఉందీ సినిమా.

సినిమాలో ఇద్దరు కుర్రాళ్లు ఉన్నా.. ఆ ఇద్దరికీ మించిన గుర్తింపు తెచ్చుకుంది వైష్ణవి. ఈ పాత్రలో చాలామంది కనెక్ట్ అవుతున్నారు. అమ్మాయిల కంటే ఎక్కువగా అబ్బాయిలు కనెక్ట్ అవుతున్నారు. అంటే తను ఎంత సహజంగా ఆ పాత్రను ప్రెజెంట్ చేసిందో ఊహించుకోవచ్చు. ఈ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇన్నోసెన్స్, ఇంకేదో కావాలనుకునే ఎగ్జైట్మెంట్ నుంచి తను బోల్డ్ డెసిషన్స్ తీసుకోవడం.. రియలైజ్ అయ్యి పశ్చాత్తాపం చెందడం వరకూ అనేక కోణాలున్నాయి. అన్ని కోణాల్లోనూ గొప్ప నటన చూపించింది వైష్ణవి చైతన్య. అందుకే తను టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అవుతుందని చాలామంది భావించారు. బట్ అలా జరుగుతున్నట్టు కనిపించడం లేదు.


బేబీ తర్వాత ఎస్కేఎన్ బ్యానర్ లోనే మరికొన్ని సినిమాలు చేయాలి అనే అగ్రిమెంట్ ఉందనే వార్తలు వచ్చాయి. అది నిజం కాదు అని కానీ.. నిజమే అని కానీ ఎవరూ ఖండించలేదు. చెప్పలేదు. ఇటు చూస్తే వైష్ణవికి పెద్ద నిర్మాతల నుంచి కానీ, మీడియం రేంజ్ హీరోల నుంచి కానీ ఆఫర్స్ కనిపించడం లేదు. మధ్యలో పూరీ జగన్నాథ్, రామ్ కాంబోలో రూపొందుతోన్న డబుల్ ఇస్మార్ట్ లో తీసుకున్నారు అనే రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ అది నిజం కాదని పూరీ టీమ్ చెప్పింది. సో ఓ మంచి వార్త విన్నాం అనుకున్న ఆడియన్స్ కు అది రూమర్ గా తేలడం సర్ ప్రైజ్ అయింది.

ఇటు చూస్తే బేబీ టీమ్ ఇంకా వైష్ణవితో ప్రమోషన్స్ చేయిస్తూనే ఉన్నారు. ఇప్పటికే సినిమా విడుదలై నెల దాటింది. ఇంకా ఆ సినిమాతోనే ఎంగేజ్ అయి ఉంటే తను బయటి కథలు వినేది ఎప్పుడు.. కొత్త సినిమాలకు కమిట్ అయ్యేది ఎప్పుడు అనేవాళ్లూ లేకపోలేదు. అఫ్‌ కోర్స్ హీరోయిన్ గా ఫస్ట్ మూవీతోనే ఇంత గుర్తింపు తెచ్చారని ఆ బ్యానర్ పై ఆమెకు ఓ అభిమానం ఉండొచ్చు. కానీ అంత పెద్ద హిట్ అయిన సినిమా.. ఇంత క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ నుంచి నెక్ట్స్ ఏంటీ అనే మాట వినపడటానికి ఎక్కువ రోజులు పడితే దానర్థం తనకు అన్నీ అలాంటి ఆఫర్సే వస్తున్నాయనీ… లేదంటే అసలు ఆఫర్సే రావడం లేదు. మరి రెండిటిలో ఏది నిజమో.. క్లారిటీ ఇవ్వడం కంటే ఓ మంచి న్యూస్ తో బేబీ నోరు విప్పితే బెటర్. లేదంటే ఈ క్రేజ్ అంతా చాలా త్వరగానే కరిగిపోతుంది.

Related Posts