విరూపాక్ష టీమ్ సాయితేజ్ ను వదిలేసిందా..

విరూపాక్ష.. ఈ యేడాది వచ్చిన బెస్ట్ హిట్స్ లో ఒకటి. అనూహ్యంగా బ్లాక్ బస్టర్ గా నిలిచిందీ చిత్రం. విడుదలకు ముందు భారీ అంచనాలైతే లేవు. కానీ సాయితేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత చేసిన సినిమాగా మాత్రం కొంత ఆసక్తి కనిపించింది. దర్శకుడుకీ ఇది రెండో సినిమానే. ఫస్ట్ మూవీ ఏంటో సడెన్ గా ఎవరూ చెప్పలేరు. అంటే పెద్ద క్రేజ్ లేదు. హీరోయిన్ వరకూ కొంత బెటర్ అనిపించుకుంది. అలాంటి సినిమా ఫస్ట్ షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఏకంగా వంద కోట్లు కలెక్షన్స్ సాధించిందీ సినిమా. ఓ రకంగా సాయితేజ్ ను యాక్సిడెంట్ బాధను మర్చిపోయేలా చేసింది ఈ విజయం. అది మళ్లీ బ్రో పోగొట్టిందనుకోండి.. అది వేరే విషయం.


అయితే రీసెంట్ గా విరూపాక్ష టీమ్ అంతా కలిసి మరో కొత్త సినిమా అనౌన్స్ చేశారు.ఈ టీమ్ లో సాయితేజ్ లేడు. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు ఇప్పుడూ దర్శకుడు. మళ్లీ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. నిర్మాణ సంస్థ కూడా అదే. టెక్నీషియన్స్ కూడా వాళ్లే ఉన్నారు.

మరి సాయితేజ్ ఎందుకు లేడు అంటే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే.. విరూపాక్ష చిత్రానికి సంబంధించి సాయితేజ్ కు సరైన అమౌంట్ ఇవ్వలేదట. లాభాల్లో వాటా ఇస్తానని చెప్పిన నిర్మాతలు ఆ మాటను నిలబెట్టుకోలేదట. దీంతో సాయితేజ్ కాస్త అసహనం వ్యక్తం చేశాడట.

ఆ కారణంగానే ఈ బ్యానర్ లో తన డబ్బులు వచ్చే వరకూ సినిమా చేయొద్దు అనుకున్నారు అంటున్నారు. సాయితేజ్ క్యారెక్టర్ తెలిసిన ఎవరూ ఇది నిజం అనుకోరు. కానీ కొన్నిసార్లు అంత పెద్ద హిట్ తర్వాత వచ్చిన తర్వాత కూడా ఎందుకు జరుగుతుంది అనే కోణంలో చూస్తే నిజమే అనిపించక మానదు. మొత్తంగా విరూపాక్ష టీమ్ సాయితేజ్ ను వదిలేసిందా.. లేక తనే వదిలేశాడా అంటే ఎవరో ఒకరు ఈ రెమ్యూనరేషన్ గురించి క్లారిటీ ఇస్తే తెలుస్తుంది. అన్నట్టు ఇది విరూపాక్షకు సీక్వెల్ కూడా కాదట. అందుకే వాళ్లు అతను కాకుండా మరో హీరో కోసం చూస్తున్నారు అనేవాళ్లూ ఉన్నారు.

Related Posts