ఆర్టిస్ట్ గా ది బెస్ట్ అనిపించుకుని వయో భారంతో ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు కోట శ్రీనివాసరావు. నటుడుగా ఆయనకు పేరు పెట్టలేం. కానీ కొన్నాళ్లుగా ఆయన చేస్తోన్న కమెంట్స్ మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తెలుగు ఆర్టిస్టులే ఉండాలి అనే డిమాండ్ బాగా చేసేవాడు. తను మాత్రం తమిళ్, హిందీ సినిమాల్లో నటించాడు.
అదేమంటే..మీరు బయటి నుంచి తెస్తే నానా పాటేకర్, నసీరుద్దీన్ షా లాంటి వారిని తీసుకురండి నో ప్రాబ్లమ్. కానీ భాష తెలియని వారు ఎందుకు అంటూ కవర్ చేసుకునేవారు. ఇక లేటెస్ట్ గా ఆయన దృష్టి హీరోల రెమ్యూనరేషన్స్ పై పడింది.ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్ హీరోలెవరూ.. తమ రెమ్యూనరేషన్స్ గురించి చెప్పుకోలేదు. పారితోషికం ఇచ్చే నిర్మాతలకు తప్ప బయటవారికి వారు ఎంత తీసుకుంటున్నారు అనేది అస్సలు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు కొంతమంది నటులు తాము రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఇది సరైంది కాదు అంటూ కొన్ని హాట్ కమెంట్స్ చేశారు కోట శ్రీనివాసరావు.
పేరు చెప్పలేదు కానీ ఈ కామెంట్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినదే అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనే ఈ మధ్య ఓ పొలిటికల్ మీటింగ్ ఈ మాట చెప్పాడు. అయితే తాము ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది నటీ నటులు చెప్పడంలో తప్పేముందీ అనేది నెటిజన్ల పాయింట్.
నిజమే.. పవన్ కళ్యాణ్ తను తీసుకుంటున్న పారితోషికం మాత్రమే కాదు.. కడుతున్న ట్యాక్స్ గురించి కూడా చెప్పాడు. అంటే తను చేస్తున్నది రైటే కదా..? అయినా కోట శ్రీనివాసరావు ఇలా చెప్పడం పవన్ అభిమానులకే కాదు.. జనరల్ ఆడియన్స్ కు కూడా పెద్దగా నచ్చలేదు. అందుకే కోట గారిని వయసు అయిపోయింది కాబట్టి కామ్ గా ఉంటే హుందాగా ఉంటుంది అంటూ మందలిస్తున్నారు. ఏదేమైనా ఒక వయసు దాటాకా.. ఉన్న ఇండస్ట్రీ గురించే కమెంట్స్ చేయడం ఆయన వ్యక్తిత్వాన్ని కూడా సూచిస్తుందని కోట గారిని ఉద్దేశించి మరికొందరు కామెంట్ చేస్తున్నారు
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…