నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ స్పై. ఐశ్వర్య మేనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఈ నెల 29న విడుదల కాబోతోంది. కార్తికేయ2తో ప్యాన్ ఇండియన్ లెవల్లో మార్కెట్ సంపాదించుకున్న నిఖిల్ స్పైతో మరోసారి దేశవ్యాప్త ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నాడు.
ఓ వివాదాస్పద కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న కథ అని ట్రైలర్ చూస్తే అర్థమైంది. భారత దేశ స్వాతంత్రం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ నడిపిన సుభాష్ చంద్రబోస్ అదృశ్యం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని మేకర్స్ కూడా చెప్పారు. ఆయన మరణించారా లేదా అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది.
దీన్నే ఇండియాస్ బెస్ట్ సీక్రెట్ అని కూడా అంటారు. ఆ సీక్రెట్ ను ఛేదించే అన్వేషణ చేయడమే ఈ స్పై పని అని అనుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకూ ఎవరూ సినిమా చేయలేదు అనే చెప్పాలి. ఆ సాహసం వీళ్లు చేస్తున్నారు. దీనికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో కానీ లేటెస్ట్ గా స్పై మూవీ సెన్సార్ పూర్తయింది.
సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. మామూలుగా ఇలాంటి కథలకు అనేక కట్స్ ఉంటాయి. బట్ ఈ మూవీకి ఒక్క కట్ కూడా చెప్పలేదట. ఓ రకంగా విశేషం అనే చెప్పాలి. ఇక సినిమా రన్ టైమ్ కూడా తక్కువే. స్పై థ్రిల్లర్ తరహా మూవీస్ కు రన్ టైమ్ చాలా కీలకం. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో అనవసరమైన పాటలు, కామెడీ ట్రాక్స్ లేకుండా ఉంటేనే ఆకట్టుకుంటాయి.
ఈ మూవీ రన్ టైమ్ కేవలం 2 గంటల 15నిమిషాలు. అలా చూస్తే ఇది స్పైకి కలిసొచ్చే అంశంగానే చూడాలి. ఇక ఈ వీకెండ్ లో స్పైతో పాటు శ్రీ విష్ణు నటించిన సామజవరగమనా మాత్రమే ఉన్నాయి. రెండూ డిఫరెంట్ జానర్స్ కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఓ రకంగా చూస్తే స్పై చిత్రానికే ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది నిఖిల్ కు కలిసొచ్చే అంశం అనే చెప్పాలి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…