ప్రభాస్ కు ఏమైంది..?

ప్యాన్ ఇండియన్ టాప్ స్టార్ ప్రభాస్ కు ఏమైంది.. కొన్ని రోజులుగా ఈ ప్రశ్న వినిపిస్తోంది. అఫ్ కోర్స్ ఆయనకు ఏం కాలేదు అని ఎవరు చెప్పినా కొందరు నమ్మడం లేదు. ఆ నమ్మకపోవడానికీ కారణాలున్నాయి. ఆదిపురుష్ విడుదల సమయంలో ప్రభాస్ యూఎస్ ట్రిప్ కు వెళ్లాడు.

అక్కడ ఆయన మోకాలికి సర్జరీ చేయించుకుంటాడు అనే వార్తలు వచ్చాయి అప్పట్లో. అది చాలా చిన్న సర్జరీ అని.. ఒక వారం పది రోజుల్లో సెట్ అవుతుందనీ చెప్పారు. బట్ అప్పుడు సర్జరీ కాలేదని టాక్. అందుకే ఇప్పుడు మళ్లీ విదేశాలకు వెళ్లాడు.


ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ మూవీ విడుదలకు ఉంది. ఎప్పుడనేది చెప్పలేం. అలాగే కల్కి సినిమాకు సంబంధించి ఓ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసి ఉన్నాడు. అటు మారుతి డైరెక్షన్ లోనటించే సినిమాకు సంబంధించి రీసెంట్ గానే ఒక భారీ ఫైట్ సీన్ పూర్తి చేశాడు.

ఆ ఫైట్ పూర్తయిన వెంటనే విదేశాలకు వెళ్లిపోయాడు. అక్కడే ఓ 20 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటాడు అంటున్నారు. అయితే మోకాలికి ఆ చిన్న శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాతే విశ్రాంతి తీసుకుంటాడని చెబుతున్నారు. కొన్నిసార్లు చిన్న గాయాలే పెద్దగా ఇబ్బంది పెడతాయి.

సో.. ఓ మూడు వారాల పాటు డార్లింగ్ విదేశాల్లోనే ఉంటాడన్నమాట. రాగానే మళ్లీ కల్కి, మారుతి సినిమాల షూటింగ్స్ ను ఏకకాలంలో స్టార్ట్ చేస్తాడు. ఈలోగా మారుతి ప్రభాస్ లేని సీన్స్ చిత్రీకరించుకుంటాడు. అటు నాగ్ అశ్విన్ అయిన సీన్స్ కు సంబంధించి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్లాన్ చేసుకుంటుంటాడు.

Related Posts