రెహ్మాన్ కాన్సర్ట్ వివాదం.. అసలేం జరిగింది

నిర్వహణా లోపం అనేది చిన్న చిన్న ఫంక్షన్స్ లోనే కనిపిస్తుంది. అలాంటిది ఓ అంతర్జాతీయ స్థాయి సంగీత దర్శకుడు నిర్వహించే కార్యక్రమానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కోట్లమంది అభిమానులున్న ఆ సంగీత దర్శకుడి కోసం లక్షలమంది జనం ఎగబడతాడు. పైగా టికెట్ పెట్టి మరీ వచ్చేవారు ఖచ్చితంగా ఆ షో కోసం ఎగబడతారు.

ఇలాంటివి ముందే పసిగట్టి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. ఈ షో వల్ల దానితో సంబంధం లేని వ్యక్తులకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూడాలి. ఈ విషయంలో చెన్నై పోలీస్ ల నిర్లక్ష్యానికి ఏఆర్ రెహ్మాన్ సోషల్ మీడియాలో బద్నాం అవుతున్నాడు. ఇంతకీ అసలేం జరిగింది అంటే..


ఈ నెల 10న చెన్నైలోని ఓ ప్యాలెస్ లో ఏఆర్ రెహ్మాన్ మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేశాడు. నిజానికి ఇది గత నెలలోనే జరగాలి. అప్పుడు భారీ వర్షాల కారణంగా వాయిదా వేసి ఈ నెల 10న నిర్వహించారు. అయితే ఈ షోకు విపరీతమైన జనం వచ్చారు. షో జరుగుతున్న ప్యాలెస్ బయట భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సామాన్య జనం చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక ప్యాలెస్ లోపల కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు. పార్కింగ్ సౌకర్యం లేదు. సీట్లు కూడా టికెట్స్ కు సరిపడా ఏర్పాటు చేయలేదు. దీంతో బయట ఉన్నవాళ్లే కాదు.. లోపలికి వెళ్లినవాళ్లు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దీనికి తోడు షోకు వచ్చిన కొందరు ఆకతాయిలు తమతో అనుచితంగా ప్రవర్తించారని కొందరు మహిళా అభిమానులు కంప్లైంట్స్ చేశారు. అయితే ఈ మొత్తం గందరగోళానికి ఆ కార్యక్రమ ఏర్పాట్లనే పర్యవేక్షించే పోలీస్ అధికారుల నిర్లక్ష్యమే కారణమే చెన్నై పోలీస్ బాస్ లు భావించారు. కాన్సర్ట్ జరిగిన ప్రదేశం వద్ద పోలీస్ లు సరిగా విధులు నిర్వర్తించలేదని నిర్ధారిస్తూ.. ఆదర్శ్, దీపా, దిశా మిట్టల్ అనే ముగ్గురు పోలీస్ లను ట్రాన్స్ ఫర్ చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు ఆఫీసర్లను సస్పెండ్ చేశారు.


ఇక అనఫీషియల్ గా వినిపిస్తున్నది ఏంటంటే.. ఈ షో కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్ లో తమిళనాడు ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా చిక్కుకుతుందని. అందుకే పోలీస్ లు ఈ వ్యవహారాన్ని ఇంత సీరియస్ గా తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో షో నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని, రెహ్మాన్ ను తిడుతూ చాలామంది సోషల్ మీడియాలో బూతుల వర్షం కురిపిస్తున్నారు.

జరిగిన అసౌకర్యానికి రెహ్మాన్ క్షమాపణలు చెప్పాడు. కాన్సర్ట్ కు హాజరు కాలేకపోయిన వారికి డబ్బులు వాపస్ చేస్తాం అని ప్రకటించాడు. ఇక ఈ వ్యవహారంలో పలువురు తమిళ్ సినిమా స్టార్స్ రహ్మాన్ కు మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

Related Posts