నా మిత్రుడు చంద్రబాబుకు ఏం కాదు – రజినీకాంత్

నారా చంద్రబాబు నాయుడుతో సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. చంద్రబాబు ఎప్పుడు పిలిచినా వస్తారు ఆయన. ఆ మధ్య ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాళ్లో కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఆ సందర్భంగా బాబు విజన్ పైనా, అభివృద్ధి పై ఆయనకు ఉన్న ప్రత్యేక శ్రద్ధల గురించి విపరీతంగా పొగిడారు. దీనికి వైఎస్ఆర్సీపీ నుంచి దారుణమైన విమర్శలు కూడా ఫేస్ చేశాడు రజినీకాంత్.

వారికి కౌంటర్ గానే జైలర్ లో మొరగని కుక్క లేదు అనే డైలాగ్ పెట్టారు అన్నారు కూడా. అయితే తాజాగా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో పోలీస్ లు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఏం కాదంటూ రజినీకాంత్ ఆయన తనయుడు నారా లోకేష్ కు ఫోన్ చేసి పరామర్శించారట. ఈ సందర్భంగా రజినీ అన్న మాటలు అంటూ కొన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


” చంద్రబాబు నాయుడు నాకు ఆత్మీయ మిత్రుడు. ఆయన ఎప్పుడూ తప్పులు చేయరు. తప్పుడు కేస్ లు, అక్రమ అరెస్ట్ లు ఆయన్ని ఏం చేయలేవు. ఆయన చేసి చూపించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాసేవే ఆయన్ని మళ్లీ బయటకు తీసుకువస్తాయి..” అంటూ రజినీకాంత్.. లోకేష్‌ తో అన్నాడని చెబుతున్నారు.


సో.. మిత్రుడు కష్టకాలంలో ఉన్నప్పుడు రజినీకాంత్ పరామర్శించే ప్రయత్నం చేశారు. కానీ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి చంద్రబాబు నాయుడు ద్వారా లబ్ది పొందినవాళ్లలో ఎవ్వరూ స్పందించలేదు. రాఘవేంద్రరావు ఒక్కడే రియాక్ట్ అయ్యాడు. నట్టికుమార్ ప్రెస్ మీట్ పెట్టి కొందరిని డైరెక్ట్ గానే తిట్టాడు. ఆ తర్వాత అశ్వనీదత్ ఫోన్ లో తీసిన ఒక వీడియో విడుదల చేసి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించాడు.

Related Posts