సాయితేజ్ కు ఏమైంది..

మెగా మేనల్లుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు సాయిధరమ్ తేజ్. వరుస సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో కొందరు అతన్ని సుప్రీమ్ హీరో అని కూడా అనేశారు. కొన్నాళ్ల క్రితం వరుస ఫ్లాపులు చూశాడు సాయిధరమ్ తేజ్. ఆ టైమ్ లో తన పేరును సాయితేజ్ గా మార్చుకున్నాడు.

ఈ పేరు మార్పు అంశం కలిసొచ్చిందా లేదా అనేది చెప్పలేం కానీ.. ఆ టైమ్ లోనే ప్రమాదం బారిన పడ్డాడు. దాదాపు చావు అంచుల వరకూ వెళ్లి వచ్చాడు అంటారు. అతను ప్రమాదానికి గురికావడానికి ముందు చేసిన సినిమా రిపబ్లిక్. అతను బెడ్ పై ఉండగానే విడుదలైంది. కానీ కమర్షియల్ గా ఆకట్టుకోలేదు.

యాక్సిడెంట్ నుంచి కోలుకుని పూర్తి చేసిన సినిమా విరూపాక్ష బ్లాక్ బస్టర్ అయింది. అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఈ మూవీ. ఈ సినిమాలో తన లుక్, నటన మరింత మెచ్యూర్డ్ గా ఉన్నాయి. అయితే హారర్ సినిమా కావడంతో పాటు రెగ్యులర్ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ లేకపోవడంతో సాయితేజ్ సమస్య గురించి ఈ సినిమాలో పెద్దగా కనిపించలేదు. బట్ త్వరలో రాబోతోన్న బ్రో సినిమా వల్ల అతను ఏదో పెద్ద సమస్యతోనే బాధపడుతున్నాడనేది అర్థమైంది.


బ్రో మూవీ నుంచి ఆమధ్య మై డియర్ మార్కండేయ అనే పాట విడుదల చేశారు. ఈ పాటలో సాయితేజ్ స్టెప్పులు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. మామూలుగా మంచి స్పీడ్ డ్యాన్సర్ అయిన సాయితేజ్.. ఈ పాటలో కాలు కదిపేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. ఏదో అలా అలా కానిచ్చేశాడు. అయితే పాటలో పవన్ కళ్యాణ్‌ కూడా ఉన్నాడు.

పైగా ఇది హితబోధ చేస్తున్నట్టుగా ఉన్న పాట కాబట్టి కొరియోగ్రఫీనే అలా ఉందేమో అనుకున్నారు చాలామంది. బట్ రీసెంట్ గా వచ్చిన అతని డ్యూయొట్ లో సైతం అదే పరిస్థితి. అస్సలు డ్యాన్స్ వేయలేకపోతున్నాడు. మామూలుగా సాయి లాంటి వాళ్లు డ్యాన్స్ చేస్తుంటే హీరోయిన్లే చిన్న చిన్న మూమెంట్స్ తో మమ అనిపిస్తాడు. బట్ ఈ పాటలో ఆ పని సాయితేజ్ చేశాడా అనిపించక మానదు.

ఎందుకంటే మేజర్ స్టెప్పులన్నీ కేతిక శర్మకు ఉంటే.. శరీరం మరీ ఇబ్బంది పడని స్టెప్పులు సాయితేజ్ కు ఉన్నాయి. దీంతో అతను డ్యాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు అనేది తేలిపోయింది.
నిజానికి సాయితేజ్ ను బలవంతంగా సెట్స్ పైకి పంపించారా అనే వాళ్లూ ఉన్నారు. లేదంటే ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకోకుండానే విరూపాక్ష సెట్ లో అడుగుపెట్టేలా చేశారు. తర్వాత ఈ సినిమా. వీటి వల్ల శారీరకంగా మరింత ఇబ్బంది పడతాడు అనేది వేరే చెప్పక్కర్లేదు.

ఇది ఇలాగే కొనసాగితే ఫ్యూచర్ లో మరిన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే బ్రో సినిమా విడుదల కాగానే అతను ఓ మూడు నెలల పాటు అమెరికా వెళ్లి పూర్తి స్థాయిలో చికిత్స తీసుకోబోతున్నాడు. ఈ మేరకు ఇప్పటికే ప్లానింగ్స్ పూర్తయ్యాయి.

బ్రో విడుదల కాగానే కొత్త సినిమాల విషయాలన్నీ పక్కన బెట్టి ముందు తన హెల్త్ విషయంలో అన్ని జాగ్రత్తగా సెట్ చేసుకున్న తర్వాతే తిరిగి వస్తాడు అంటున్నారు. అదీ నిజమే.. ఇలాంటి కమిట్మెంట్స్ కు టెంప్ట్ అయితే ఫ్యూచర్ అంతా స్పాయిల్ అవుతుంది. అసలే హెవీ కాంపిటీషన్ ఉన్న ఫీల్డ్ లో అన్ని విధాలా సన్నద్ధంగా లేకపోతే సమస్యలు వస్తాయి.

Related Posts