శ్రీ లీల భారీగా పెంచేసింది

శ్రీ లీల.. తెలుగు తెరపైకి సునామీలా దూసుకు వచ్చింది. ఫస్ట్ మూవీ యావరేజ్ అయినా అమ్మడి బెస్ట్ ఇంప్రెషన్ కు టాలీవుడ్ ఫిదా అయింది. అందుకే వరుసగా ఆఫర్స్ వెల్లువెత్తాయి. ఈ మద్య కాలంలో ఏ హీరోయిన్ కూ లేనన్ని ఆఫర్స్ వచ్చాయి. తన చేతిలో ఇప్పుడు చిన్నా పెద్ద స్టార్స్ వి కలిపి ఏకంగా 7 సినిమాలున్నాయి.

ఈ సినిమాలతోనే ఆల్రెడీ టాలీవుడ్ లో టాప్ అనిపించుకున్న పూజాహెగ్డేకు ఎసరు పెట్టేసింది. రష్మిక మందన్నాను బాలీవుడ్ కు పంపించింది. ప్రస్తుతం అమ్మడి హవా మామూలుగా లేదు అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్‌ తో ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్‌ బాబుతో గుంటూరు కారం అంటూ టాప్ హీరోల సినిమాల్లో ఉంది. సో.. నెక్ట్స్ టాలీవుడ్ టాప్ లేపే బ్యూటీ తనే అని ఇంకా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలకు ప్రస్తుతం తను తీసుకుంటోన్న రెమ్యూనరేషన్.. చిన్న సినిమాలకైతే కోటి, పెద్ద హీరోల సినిమాలైతే కోటిన్నర. అయితే ఇంత బిజీగా ఉన్నా.. ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నా.. కొన్నాళ్లుగా తనకంటే రెమ్యూనరేషన్ పరంగా కేవలం ఒకే సినిమా చేతిలో ఉన్న మృణాల్ ఠాకూర్ చాలా బెటర్ అనే వార్తలు వస్తున్నాయి. అవన్నీ ఈ ధమాకా బ్యూటీ వరకూ వెళ్లినట్టున్నాయి. అందుకే అమాంతంగా రేటు పెంచేసింది.


ఇకపై శ్రీ లీల డేట్స్ కావాలంటే రెండు కోట్లు చెల్లించాలి. అది కూడా గుంటూరు కారం, ఉస్తాద్ సినిమాలు విడుదలయ్యే వరకే.. ఇవి రిలీజ్ అయ్యి హిట్ కొట్టాయా.. మరో కోటి పెంచేస్తుంది. నిన్నటి వరకూ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అనిపించుకున్న బ్యూటీ కూడా ఇప్పుడు కాస్ట్ కాల్షీట్స్ అంటోందంటే.. అదీ తన రేంజ్ అనుకోవాల్సిందే. నిజమే.. తనేమీ పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్లు మాత్రమే అనడం లేదు కదా.. అంచేత రెమ్యూనరేషన్ పెంచడంలో తప్పేం లేదు అంటున్నారు మరికొందరు. ఏదేమైనా శ్రీ లీల రైజింగ్ టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లకు గుబులు రేపుతుందనేది ఒప్పుకోవాల్సిన అంశం.

Related Posts