‘ఓం భీమ్ బుష్’ సాంగ్.. వెడ్డింగ్ సీజన్ లో పర్ఫెక్ట్ సాంగ్

ఈవారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలలో ‘ఓం భీమ్ బుష్‘ ఒకటి. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఈ సినిమాతో థియేటర్లలో ఫుల్ లెన్త్ ఎంటర్ టైన్ పంచడానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ‘ఓం భీమ్ బుష్’ మంచి బజ్ ఏర్పరచుకుంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘ది వెడ్డింగ్ సాంగ్‘ రిలీజయ్యింది.

ఈ పెళ్లిళ్ల సీజన్ లో పర్ఫెక్ట్ సెలబ్రేషన్ సాంగ్ ఇదే అంటూ చిత్రబృందం వదిలిన ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ‘హే.. పీపీ డుం డుం మోతే మోగే కళ్యాణమే.. హే.. వారు వీరు అంతా కూడే వైభోగమే‘ అంటూ కృష్ణకాంత్ రాసిన ఈ గీతాన్ని సన్నీ ఎమ్.ఆర్. సన్నీ స్వరకల్పనలో కపిల్ కపిలన్ ఆలపించారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు సంయుక్త నిర్మాణంలో శ్రీ హర్ష కొనుగంటి తెరకెక్కించిన ‘ఓం భీమ్ బుష్’.. ‘నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్’ అంటూ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది.

Related Posts