దర్శకురాలిగా మారిన సంజన అన్నే

‘బిగ్ బాస్’ సీజన్ 2 కంటెస్టెంట్ సంజన అన్నే.. పలు సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గానూ నటించింది. ఇప్పుడు దర్శకురాలిగా తనలోని కొత్త టాలెంట్ ను బయటపెట్టబోతుంది సంజన. అన్నే క్రియేషన్స్ బ్యానర్ పై సంజన అన్నే దర్శకత్వంలో ‘క్రైమ్ రీల్’ అనే సినిమా రూపొందుతోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ‘క్రైమ్ రీల్’ మూవీ డబ్బింగ్ పనుల్లో ఉంది. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నారట. ఈ సినిమాలో సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలు పోషించారు. బాబు కొల్లాబత్తుల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ ఉదగండ్ల ఎడిటర్. ఈ సినిమాకి రచన, దర్శకత్వం సంజన అన్నే.

Related Posts