వైజయంతీ మూవీస్ పబ్లిక్ వార్నింగ్

వైజయంతీ మూవీస్ బ్యానర్ పబ్లిక్ కు వార్నింగ్ ఇస్తూ ఓ లెటర్ ఇష్యూ చేసింది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా కల్కి2898ఏడి అనే చిత్రం రూపొందుతోంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ లో రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికా పదుకోణ్‌ నటిస్తోంది. విలన్ గా కమల్ హాసన్.. కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, పశుపతి కీలక పాత్రలు చేస్తున్నారు.

అయితే రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఓ క్లిప్ లీక్ అయింది. అందుకు సంబంధించిన వారిపై లీగల్ యాక్షన్ కోసం కేస్ పెట్టింది నిర్మాణ సంస్థ. దీంతో పాటు భవిష్యత్ లో మళ్లీ అలాంటి సమస్యలు రాకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ.. ఓ లెటర్ హెడ్ జారీ చేసింది.

దీన్ని కాస్త సింబాలిక్ గా చెప్పుకుంటే..
” ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా.. కల్కి 2898ఏడి అనే చిత్రంలోని సీన్స్, సంగీతం, ఫుటేజ్, స్టిల్స్, ఇమేజ్ లకు సంబంధించిన సర్వహక్కలూ వైజయంతీ మూవీస్ బ్యానర్ కు సొంతమై ఉన్నాయి. అందువల్ల ఇందులో ఏవైనా.. ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా దొంగిలించడం చేసి.. సోషల్ మీడియాలో పెడితే .. వారిపై సైబర్ పోలీస్ ల సహాయంతో 1957 యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.. ” అంటూ ఓ నోటీస్ ఇష్యూ చేసింది. సో.. ఇకపై ఈ చిత్రమే కాదు.. ఏ చిత్రానికి సంబంధించి ఇలాంటివి జరిగినా వారు శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్టుగానే భావించాలి.

Related Posts