మరిన్ని ఉప్పెనలు కావాలి

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసింది కృతిశెట్టి. తన క్యూట్ లుక్స్, ఫేస్ తో కుర్రకారుకు మొదటి సినిమాకే జ్వరాలు తెప్పించింది. ఈ సినిమా విజయంలో తనదీ కీలక పాత్రే. ఆమె కోసమే రిపీటెడ్ గా థియేటర్స్ కు వెళ్లిన ఆడియన్స్ కూడా ఉన్నారు. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు అంటూ వరుస విజయాలు అందుకుని టాలీవుడ్ కు కాబోయే టాప్ హీరోయిన్ అనిపించుకుంది. బట్ ఇక్కడే అమ్మడికి లక్ కాస్త అడ్డం తిరిగింది. అటుపై అన్నీ అపజయాలే. వీటిని దాటుకుని మళ్లీ ఓ సాలిడ్ హిట్ కోసం చూస్తోన్న కృతిశెట్టి బర్త్ డే ఇవాళ(గురువారం).


కృతిశెట్టి పుట్టింది ముంబైలో. కుటుంబానికి కర్ణాటకకు చెందిన మంగుళూరు ప్రాంతం. తుళు సొంత భాష. ముంబైలో పుట్టింది కాబ్టటే తన తెరంగేట్రం అక్కడే జరిగింది. సూపర్ 30 అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. అందులో స్టూడెంట్. పెద్దగా ప్రాధాన్యం లేని పాత్ర. బట్ ఫస్ట్ మూవీ. ఈ ఇంప్రెషన్ తోనే ఉప్పెనలో అడుగుపెట్టింది. విశేషం ఏంటంటే.. ఈ మూవీ దర్శకుడు, హీరో, హీరోయిన్ ముగ్గురికీ మొదటి చిత్రమే. అయినా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా ఈ ముగ్గురూ ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అదే కృతి శెట్టిన టాలీవుడ్ లో లైమ్ లైట్ లోకి తెచ్చింది. బట్ ఆ తర్వాత చేసిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ చిత్రాలు వరుసగా పోవడంతో తన కెరీర్ కాస్త డల్ అయింది.


ప్రస్తుతం కృతిశెట్టి శర్వానంద్ సరసన ఓ సినిమా చేస్తోంది. తమిళ్, మళయాలంలోనూ ఒక్కో ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఈ చిత్రాలు భారీ విజయం సాధించి.. తన కెరీర్ మరింతగా షైన్ అవ్వాలని కోరుకుందాం..

Related Posts