టాలీవుడ్

నలభై రోజుల పాటు ఏకధాటిగా ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘విశ్వంభర’ విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఇక.. రిలీజ్ కు రెండు నెలల ముందుగానే ‘విశ్వంభర’ ఫైనల్ కాపీ రెడీ చేయడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసిందట టీమ్.

మే 20 నుంచి ‘విశ్వంభర’ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారట. దాదాపు జూన్ చివరి వరకూ ఈ షెడ్యూల్ జరగనున్నట్టు తెలుస్తోంది. అంటే.. 40 రోజుల పాటు నాన్‌-స్టాప్ గా షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి, త్రిష తో పాటు.. మిగతా లీడ్ కాస్టింగ్ అంతా పాల్గొంటుందట. ఈ సినిమాకోసం కీరవాణి స్వరపరుస్తోన్న పాటలను కూడా ఈ షెడ్యూల్ లో తెరకెక్కించనున్నారట.

‘జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి’ చిత్రాల తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ఇది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎంతో ప్రాధాన్యత ఉండబోతుంది. జూలై నుంచి ఫుల్ స్వింగ్ లో ‘విశ్వంభర’ విజువల్ ఎఫెక్స్ట్ పనులు జరగనున్నాయి. అలా.. అక్టోబర్ చివర లేదా నవంబర్ వరకూ ‘విశ్వంభర’ను రెడీ చేయాలనే కృతనిశ్చయంతో ఉందట చిత్రబృందం.

Telugu70mm

Recent Posts

Pragya Jaiswal

5 hours ago

Honey Rose

6 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో సుధీర్ బాబు కొత్త చిత్రం

తెలుగు కథానాయకుల్లో అసలు సిసలు యాక్షన్ హీరో అనిపించుకునే క్వాలిటీస్ సుధీర్ బాబు కి పుష్కలంగా ఉన్నాయి. అందుకు ప్రధాన…

6 hours ago

Nabha Natesh

6 hours ago

‘డబుల్ ఇస్మార్ట్‘ నుంచి ‘స్టెప్పామార్‘ వచ్చేసింది

ఉస్తాద్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతోన్న క్రేజీ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్‘. ‘ఇస్మార్ట్ శంకర్‘కి సీక్వెల్…

7 hours ago

ఆగస్టు 15 రేసులోకి విక్రమ్ ‘తంగలాన్‘

ఈ ఏడాది ప్రథమార్థంలో పెద్ద హీరోలు నటించిన చిత్రాలేవి పెద్దగా రాలేదు. అయితే.. ద్వితియార్థంలో మాత్రం వరుసగా బడా హీరోలంతా…

7 hours ago