టాలీవుడ్

క్రేజీ టైటిల్ తో విశ్వక్ సేన్

మల్టీ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. విజయ్ దేవరకొండలాగా అతని యాటిట్యూడ్ కూ ఫ్యాన్స్ ఉన్నారు. హీరోగానే కాక రచయిత, దర్శకుడుగానూ సత్తా చాటుతున్న విశ్వక్ సేన్ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు.

ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం స్టార్ట్ అయిన ఓ సినిమాకు క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్. రవితేజ ముళ్లపూడి అనే కొత్తదర్శకుడు పరిచయం కాబోతోన్న ఈ మూవీని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు. ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా తీసుకున్నారు.


ఈ సినిమాలో విశ్వక్ సేన్ మెకానిక్ గా కనిపిస్తాడట. దీంతో అతని పేరు మీదుగానే “మెకానిక్ రాకీ” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు. మెకానిక్ రాకీ అని వినగానే ఆకట్టుకునేలా ఉంది. క్యాచీగా ఉంది. విశ్వక్ సేన్ ఇమేజ్ కూ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.

పైగా కథలో భాగంగా కనిపించే టైటిల్ కాబట్టి సినిమాకూ మరింత ప్లస్ అవుతుంది. టైటిల్ ను బట్టి ఇది కంప్లీట్ మాస్ మూవీ అనుకోవడానికి లేదు. క్లాస్ ను కూడా అలరించేలా కథనం ఉంటుందట. మరో విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి మాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


ప్రస్తుతం విశ్వక్ సేన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో లంకల రత్నం అనే సినిమా ఒకటి. లిరిసిస్ట్ నుంచి రైటర్ గా మారిన కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని చెబుతున్నారు.

ఆ మధ్య విడుదల చేసిన లుక్ కూడా ఆకట్టుకుంది. దీంతో పాటు తను లేడీ గెటప్ లో మరో చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీకి లీలా అనే టైటిల్ అనుకున్నారు. మొత్తంగా ఈ మెకానిక్ రాకీ అనే టైటిల్ మాత్రం అతనికి బాగా సూట్ అవుతుందని చెప్పొచ్చు.

Telugu 70mm

Recent Posts

Ongoing suspense over the Nani-Sujeeth movie

Natural Star Nani is on a good streak. He has a string of hits to…

1 hour ago

వి.ఎఫ్.ఎక్స్ పనులు పూర్తిచేసుకున్న విజయ్ ‘గోట్’

తమిళ దళపతి విజయ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక..…

1 hour ago

‘కల్కి’ సినిమా మొత్తానికి ఒకటే పాట?

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…

2 hours ago

రేపటి నుంచి మళ్లీ రంగంలోకి నటసింహం

నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…

2 hours ago

‘దేవర’ మొదటి పాట కోత.. రెండో పాట లేత

'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…

4 hours ago

నాని-సుజీత్ సినిమాపై కొనసాగుతోన్న సస్పెన్స్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…

5 hours ago