టాలీవుడ్

విశ్వక్ సేన్ గ్యాంగ్స్ గోదావరి

మాస్ కా దాస్ అనిపించుకున్న విశ్వక్ సేన్ కొత్త గ్యాంగ్ తయారు చేసుకున్నాడు. దానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పేరు పెట్టుకున్నాడు. యస్.. అంతా ఊహించినట్టుగానే విశ్వక్ సేన్ కొత్త సినిమాకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్ నే ఫిక్స్ చేసుకున్నారు.

కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తోంది. డిజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. టైటిల్ తో పాటు రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ చూస్తే సినిమాపై అంచానాలు ఒక్కసారిగా మారాయి అనే చెప్పాలి. ఇప్పటి వరకూ విశ్వక్ సేన్ ఈ తరహా సినిమా చేయలేదు. అదే కొత్తదనం అంటే మేకింగ్ పరంగా కృష్ణ చైతన్య మరో మెట్టు పైన కనిపిస్తున్నాడు. గోదావరి లోని ఇసుక ర్యాంప్స్ నేపథ్యంలో నడిచే కథలా ఉంది. ఈ సినిమా 1980ల నేపథ్యంలో సాగుతుందని ముందే చెప్పారు. ఆ మేరకు యాంబియన్స్ కూడా పక్కాగా సెట్ అయింది.

“అన్నాయ్ మేమూ గోదారోళ్లం.. మాటొకటే సాగదీస్తాం.. తేడాలొస్తే నవ్వుతూ నరాల్లాగేస్తాం.. ” అంటూ విశ్వక్ చెప్పిన డైలాగ్ చూస్తే ఇది ఊరమాస్ ఎంటర్టైనర్ అనిపిస్తోంది.ఈ సినిమాలో అంజలి కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. నాజర్, సాయికుమార్, గోపరాజు రమణ పాత్రలు కీలకంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ గోదావరి బ్యాక్ డ్రాప్ లో అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఇది వాటన్నిటికీ పూర్తి భిన్నంగా ఉంటుందనిపించేలా ఈ గ్లింప్స్ కనిపిస్తోంది.

మామూలుగా గోదావరి నేపథ్యంలో సినిమాలు అంటే పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, మావితోపులు, అనుబంధాలు, ఆప్యాయతలు ఇట్టాంటివే చూసిన ఆడియన్స్ కు ఈ కొత్త బ్యాక్ డ్రాప్ ఖచ్చితంగా కొత్తగానే ఉటుందని చెప్పొచ్చు. ఏదైనా విశ్వక్ సేన్ సెలక్షన్ బావుందనే చెప్పాలి. ఇక కృష్ణ చైతన్య టేకింగ్ పరంగానూ మెప్పిస్తే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కలెక్షన్ల వరద పారిస్తుందని వేరే చెప్పక్కర్లేదు.

Telugu 70mm

Recent Posts

Rashi Singh

48 seconds ago

మహేష్-రాజమౌళి మూవీ కాస్టింగ్ డైరెక్టర్ పై క్లారిటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి చేయబోయే సినిమా 'ఎస్.ఎస్.ఎమ్.బి.29'. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న…

38 mins ago

‘కన్నప్ప’ సినిమాలోని కీలక పాత్రలో కాజల్

మంచు విష్ణు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో తారల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్ లోకి వరుసగా అగ్ర…

2 hours ago

Mirnalini Ravi

2 hours ago

Ketika Sharma

2 hours ago

Janhvi Kapoor

2 hours ago