విరూపాక్ష ఫస్ట్ డే కలెక్షన్స్

సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన సినిమా విరూపాక్ష. కార్తీక్ దండు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. చాలా రోజుల తర్వాత సాయితేజ్ మూవీకి ఈ రేంజ్ హిట్ టాక్ రావడం విశేషం. ప్రమాదానికి గురి కావడం చాలా ఆలస్యంగా విడుదలైనా.. బాక్సాఫీస్ వద్ద అదగొడుతోందీ చిత్రం. బివిఎఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన విరూపాక్షకు సుకుమార్ రైటింగ్ నిర్మాణంలో భాగస్వామి. అలాగే సుకుమార్ స్క్రీన్ ప్లే కూడా అందించాడు. ఆ స్క్రీన్ ప్లేనే చిత్రానికి హైలెట్ కావడం విశేషం. జెన్యూన్ థ్రిల్లర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునేలా రూపొందించాడు దర్శకుడు.

మసూద తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో భయపెడుతోంది కూడా. హీరోయిజం, అనవసర పాటలు, కామెడీ ట్రాకులు లేకుండా పూర్తిగా కథకు సరెండర్ అయ్యి తీయడంతో.. ఇది కంప్లీట్ గా డైరెక్టర్స్ మూవీగా పేరు తెచ్చుకుంది. సాయితేజ్ నటన, ఎనర్జీ ఆకట్టుకుంటాయి. అలాగే సంయుక్త మీనన్ అద్భుతంగా నటించింది. తనే ఈ సినిమాకు మెయిన్ హైలెట్ అంటే అతిశయోక్తి కాదు. అయితే కొన్నాళ్లుగా టాలీవుడ్ బాక్సాఫీస్ కాస్త స్తబ్దుగా ఉంది. ఆ స్తబ్ధతను విరూపాక్ష బద్ధలు కొట్టింది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో పాటు మొదటి రోజు మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. విశేషం ఏంటంటే.. మెగాస్టార్ తో పాటు ఆయన ఫ్యామిలీ హీరోలందరికీ నైజాం ఏరియాలో మంచి పట్టు ఉంది. అది సాయితేజ్ కూ వర్కవుట్ అయ్యింది. నైజాంలోనే హయ్యొస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. మరి ఆ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.


నైజాం : 1 కోటి 82 లక్షలు
వైజాగ్ : 58 లక్షలు
సీడెడ్ : 54 లక్షలు
గుంటూర్ : 46 లక్షలు
నెల్లూర్ : 20 లక్షలు
కృష్ణా : 32 లక్షలు
వెస్ట్ : 47 లక్షలు
ఈస్ట్ : 40 లక్షలు

టోటల్ ఏపి, తెలంగాణ కలిపి 4 కోట్ల 79 లక్షలు షేర్ వసూలు చేసింది. అంటే గ్రాస్ గా చూస్తే 8 కోట్ల 60 లక్షలు కలెక్షన్స్ వసూలయ్యాయి. ఓవర్శీస్ తో కలిపి మొత్తం మొదటి రోజు కలెక్షన్స్ 11.85 కోట్లు గ్రాస్.
విరూపాక్ష మూవీని తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్ల రేంజ్ లో థియేట్రికల్ రిలీజ్ కు అమ్మారు. ఓవర్శీస్ మూడు కోట్లు. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. పైగా పోటీ కూడా లేదు కాబట్టి.. ఈ ఫిగర్ ను సాధించడమే కాదు.. భారీ లాభాలు కూడా తెస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఏదేమైనా సమ్మర్ కూడా కావడంతో విరూపాక్ష సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు చాలానే ఉన్నాయి.

Related Posts