టాలీవుడ్

షారుఖ్ సినిమాలో విజయ్ ఫైట్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ జవాన్. తమిళ్ స్టార్ అట్లీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం చేస్తున్నాడు. ఆ మధ్య విడుదల చేసిన ట్రైలర్ తో మోస్ట్ ప్రామిసింగ్ అనిపించుకుందీ చిత్రం.

ఆల్రెడీ పఠాన్ తో కంట్రీ మొత్తం షేక్ చేసి ఉన్నాడు షారుఖ్. ఆ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో జవాన్ పై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో తమిళ్ స్టార్ ఇళయదళపతి విజయ్ కూడా నటిస్తున్నాడు అని కొన్ని వార్తలు వచ్చాయి. మొదట్లో వీటిని రూమర్స్ అనే అనుకున్నారు. బట్ నిజమే. విజయ్ జవాన్ సినిమాలో ఓ కేమియో రోల్ చేస్తున్నాడు అని కన్ఫార్మ్ చేశారు. మామూలుగా కేమియో అంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు. కానీ ఈ పాత్ర అలా ఉండదట.. షారుఖ్ కోసం ఓ భారీ ఫైట్ సీన్ లో విజయ్ కూడా కనిపిస్తాడంటున్నారు. ఇప్పటికే ఈ ఫైట్ షూటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇంతకు ముందు చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ లా, షారుఖ్ పఠాన్ లో సల్మాన్ ఖాన్ లా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ లోనే విజయ్ కూడా పార్టిసిపేట్ చేస్తాడట. అయితే ఈ సినిమాలో నటిస్తున్నందుకు గానూ విజయ్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. మేకర్స్ ఆఫర్ చేసినా తనకు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు అట్లీ బాలీవుడ్ లో చేస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో పాటు షారుఖ్ పై ఉన్న రెస్పెక్ట్ వల్ల రెమ్యూనరేషన్ వద్దన్నాడట.

ఈ వారంలోనే ఈ ఫైట్ ను చిత్రీకరించోతున్నారని టాక్. విజయ్ వల్ల ఇతర భాషల్లో ఏమో కానీ.. తమిళ్ లో మాత్రం బాక్సాఫీస్ కు డబుల్ జోష్ వస్తుందనే చెప్పాలి. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Telugu 70mm

Recent Posts

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్

ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్ సందడి చేస్తోంది. లెజెండరీ యాక్టర్ మోహన్ బాబుతో పాటు.. మంచు…

3 hours ago

బెంగళూరు రేవ్ పార్టీ లో తెలుగు సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే..!

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీ.ఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున…

3 hours ago

Pooja Hegde

4 hours ago

ఎన్టీఆర్ కు.. మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ బర్త్ డే విషెస్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కి.. సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.…

4 hours ago

ఆగస్టు నుంచి పట్టాలెక్కబోతున్న ‘ఎన్టీఆర్-నీల్‘ ప్రాజెక్ట్

ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి.…

4 hours ago