తమిళ దళపతి విజయ్ మల్టీటాలెంటెడ్ పర్సన్. నటనతో పాటు తల్లి వారసత్వంగా పాటలు పాడటంలోనూ తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. ముఫ్ఫై ఏళ్ల నుంచి తన సినిమాల్లో అడపాదడపా పాటలు పాడుతూనే వస్తున్నాడు విజయ్. అలాగే.. విజయ్ సినిమాల్లో అతను పాడిన పాటలు సూపర్ హిట్స్ అవుతూ ఉంటాయి. ‘తుపాకీ’లోని ‘గూగుల్ గూగుల్’, ‘కత్తి’లో ‘సెల్ఫీ పుల్లా’, ‘మాస్టర్’లో ‘కుట్టీ స్టోరీ’, ‘బీస్ట్’లోని ‘జాలీ ఓ జింఖానా’, ‘వారసుడు’లో ‘రంజితమే’, ‘లియో’ చిత్రంలోని ‘నా రెడీ’ పాటలు అందుకు ఉదాహరణ.
ఇక.. లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ కోసం ఇప్పటికే ‘విజిల్ పోడు’ పాట పాడాడు. యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఇప్పటికే తమిళనాట చార్ట్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ‘ది గోట్’ కోసం మరో పాట కూడా పాడాడట విజయ్. అంటే.. తన సినిమాల్లో ఎప్పుడూ ఒక పాటనే పాడే విజయ్.. ఈసారి ‘గోట్’ కోసం ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా ఇవ్వనున్నాడట. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ది గోట్’ సెప్టెంబర్ 5న విడుదలకు ముస్తాబవుతోంది.
Mass maharaja Ravi Teja and dashing director Puri Jagannath have a good unbreakable relationship. Puri…
In the past, most of the films were two and a half hours long. However..…
Young hero Raj Tarun is involved in controversy. Lavanya, a young woman, has lodged a…
Creating wonders with debut directors is not a common thing. This has been proved many…
మాస్ మహారాజ రవితేజ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. అసలు రవితేజను స్టార్…
నటుడు: సుమంత్సినిమాటోగ్రఫి: వరుణ్ అంకర్లసంగీతం: శ్రీరామ్ మడూరీఎడిటింగ్: మురళీ కృష్ణ మన్యంనిర్మాత: రఘువీర్ గోరిపర్తిదర్శకత్వం: ప్రశాంత్ సాగర్ అట్లూరివిడుదల తేది:…