ఈ మధ్య స్టార్ హీరోలెవరూ సరిగా మాట మీద నిలవడం లేదు. ముందు ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ ను కాదని తర్వాత కమిట్ అయిన సినిమాలను ముందుకు తెస్తున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకున్నట్టుగా కనిపిస్తున్నాడు విజయ్ దేవరకొండ.
టాలీవుడ్ లో ఓవర్ నైట్ సెన్సేషన్ అయినా.. తర్వాత వరుస ఫ్లాపులతో షాక్ తింటున్నాడు విజయ్ దేవరకొండ. దీనికి తోడు వివాదాలు కూడా నిత్యం వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా లైగర్ విషయంలో చేసిన అతి హడావిడీ అతనికి పెద్ద మైనస్ అయింది. ఆ మూవీ డిజాస్టర్ తర్వాత మనోడి యాటిట్యూడ్ లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి.
ప్రస్తుతం లాస్ట్ ఇయర్ ఆగిపోయిన శివ నిర్వాణ సినిమా ”ఖుషీ”ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈమూవీ ఈ యేడాది సెప్టెంబర్ 1న విడుదలవుతుంది. తర్వాత గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ యాక్షన్ స్పై థ్రిల్లర్ చేయాల్సి ఉంది. ఆల్రెడీ విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. దీని తర్వాత దిల్ రాజు బ్యానర్ లో పరశురామ్ తో సినిమా చేయాలి. కానీ ఇప్పుడు ఆర్డర్ మారిందట.
పరశురామ్ రీసెంట్ గాతనపై వచ్చిన అడ్వాన్స్ ల అలిగేషన్స్ ను క్లియర్ చేసుకుంటున్నాడు. దీంతో విజయ్ దేవరకొండతో సినిమాకూ లైన్ క్లియర్ అయింది. అందుకే ముందు పరశురామ్ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాడట. అంటే గౌతమ్ తిన్ననూరికి డైరెక్ట్ గానే షాక్ ఇస్తున్నాడని చెప్పొచ్చు.
మరి ఈ విషయంలో దిల్ రాజు రాజకీయం ఏదైనా ఉందా లేక .. మంచి అండర్ స్టాండింగ్ తోనే ముందు ఒప్పుకున్న ప్రాజెక్ట్ ను వెనక్కి నెడుతున్నారా అనేది తెలియదు కానీ.. విజయ్ కూడా పవన్ కళ్యాణ్ లాగా ముందు కమిట్ అయిన సినిమాలను పక్కన బెడుతూ.. కొత్తగా కమిట్ అయిన సినిమాలను ముందుగా తెరపైకి తెస్తున్నాడు. మరి వ్యవహారంలో వీరి స్ట్రాటజీ ఏంటో కానీ.. గౌతమ్ తిన్ననూరికి మరింత టైమ్ వేస్ట్ అవుతుందని మాత్రం చెప్పొచ్చు.
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…
Man of masses NTR's birthday.. Only two more days left. He is acting as Young…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…