టాలీవుడ్

ముహూర్తానికి సిద్ధమైన వెంకటేష్-అనిల్ రావిపూడి చిత్రం

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమాని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మించబోతున్నాడు. వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసిన ఈ మూవీ ఎప్పుడు ముహూర్తాన్ని జరుపుకుంటోంది? ఎప్పుడు పట్టాలెక్కుతోంది? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వెంకీ ఫ్యాన్స్. లేటెస్ట్ గా వెంకటేష్-అనిల్ రావిపూడి మూవీ ముహూర్తానికి డేట్ ఫిక్సయ్యిందట. ఈ సినిమాని జూలై 3న ప్రారంభించనున్నారట.

‘ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత వెంకీ-అనిల్ కాంబోలో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ సినిమాకోసం తన మార్క్ ఫన్ ఎలిమెంట్స్ తో పాటు.. సరికొత్త కథ, కథనాలను తీర్చిదిద్దుతున్నాడట అనిల్ రావిపూడి. ఈ సినిమాలో వెంకటేష్ ఎక్స్ కాప్ గా కనిపించబోతున్నాడని.. అతనికో ఎక్స్ గాళ్ ఫ్రెండ్.. ఎక్స్ లెంట్ వైఫ్ ఉంటారని.. ఈ ఎక్స్ ట్రార్డినరీ ట్రాయంగులర్ క్రైమ్ ఎంటర్ టైనర్ గురించి ఆమధ్య హింట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Telugu70mm

Recent Posts

Divyabharathi

2 hours ago

Kajal Aggarwal

2 hours ago

Vijay Mallya episode in ‘Bharateeyudu 2’

After 'Kalki', 'Bharateeyudu 2' is another South movie that is going to make noise at…

4 hours ago