ఇటలీకి పయనమైన వరుణ్-లావణ్య

కాబోయే వధూవరులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి ఇటలీ బయలుదేరారు. నవంబర్ 1న ఇటలీ దేశంలోని టస్కానీ వద్దనున్న బోర్గో శాన్ ఫెలోస్ గ్రాండ్ రిసార్ట్ లో వీరి వివాహం జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఇటలీకి వెళుతున్న వరుణ్, లావణ్య విజువల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

పెళ్లికి ముందు అక్టోబర్ 30న మెహందీ, హల్దీ వేడుకలు జరగనున్నాయి. పెళ్లి తర్వాత నవంబర్ 5న హైదరాబాద్ లో రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది. వరుణ్ తేజ్, లావణ్య డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీసమేతంగా ఇటలీలో సందడి చేస్తున్నాడు. ఈ రెండు మూడు రోజుల్లోనే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంతా ఇటలీ బయలుదేరనున్నారట.

Related Posts