కమల్ – మణిరత్నం సినిమా ప్రారంభం

విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో సినిమా ముహూర్తాన్ని జరుపుకుంది. కమల్ హాసన్ 234వ చిత్రమిది.

కమల్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మణిరత్నం మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 1987లో ‘నాయకుడు‘ సినిమాకి తొలిసారి కలిసి పనిచేశారు ఈ లెజెండ్స్. మళ్లీ ఇన్నేళ్లకు సినిమా చేస్తున్నారు.

కమల్ 234వ చిత్రానికి గ్రేట్ టెక్నికల్ టీమ్ పనిచేస్తుంది. ఈ సినిమాకి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రవి.కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నాడు.

ప్రెజెంట్ సౌత్ లో సెన్సేషనల్ ఫైట్ మాస్టర్స్ అయిన అన్బారివ్ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫర్స్ గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న కమల్ హాసన్ బర్త్ డే స్పెషల్ గా ఈ చిత్రం నుంచి స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related Posts