రజినీకాంత్ తెలుగులోనూ దున్నేస్తున్నాడు

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు హిట్ టాక్ వస్తే బ్లాక్ బస్టర్ అయినట్టే అని మరోసారి ప్రూవ్ అయింది. రీసెంట్ గా వచ్చిన జైలర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తమిళనాడు నుంచి ఓవర్శీస్ వరకూ.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ జైలర్ హుకుం కు బాక్సాఫీస్ బానిసైపోయింది.ఈ చిత్రాన్ని కొన్నవాళ్లంతా డబుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక తెలుగులో కొన్నాళ్లుగా రజినీకాంత్ మార్కెట్ బాగా దెబ్బతిన్నది. దీంతో ఈ మూవీ డబ్బింగ్ రైట్స్ కూడా చాలా తక్కువకే వచ్చాయి. తీరా చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పటికే కేవలం నాలుగు రోజుల్లోనే 32 కోట్లు కొల్లగొట్టిందీ సినిమా. రజినీకాంత్ సినిమాకు ఈ రేంజ్ మార్కెట్ అంటే చిన్న విషయం కాదు.


తెలుగులో చాలా ఏరియాస్ కు దిల్ రాజు రైట్స్ తీసుకున్నాడు. ముందు భోళా శంకర్ ను తీసుకోవాలనుకున్నా.. చివరి నిమిషంలో తప్పుకుని మెగాస్టార్ ను కాదని సూపర్ స్టార్ కు ఓటేశాడ. అతని అంచనా తప్పలేదు. భోళా శంకర్ పోయింది. జైలర్ భారీ లాభాలు తెస్తోంది. ఈ సోమవారం కాస్త యావరేజ్ గా ఉన్నా.. మళ్లీ మంగళవారం పబ్లిక్ హాలిడే కాబట్టి మరిన్ని కలెక్షన్స్ ఖాయం అనుకోవచ్చు. మొత్తంగా ఇప్పటి వరకూ ఉన్న ఓ అంచనా ప్రకారం ఈ చిత్రం తెలుగులో 150 శాతం లాభాలు తెచ్చిందంటున్నారు. అంటే ఈ మధ్య కాలంలో కొన్నవాళ్ల ఇళ్లల్లో పండగను తెచ్చిన సినిమాగా ఈ డబ్బింగ్ మూవీనే చెప్పాలి.


బీస్ట్ వంటి డిజాస్టర్ తర్వాత నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ బ్యాక్ బోన్ గా నిలిచింది. తమన్నా పాట, సునిల్ కామెడీతో పాటు కీలక పాత్రల్లో కనిపించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ల ఎంట్రీకి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. అలాగే మళయాలీ నటుడు వినాయకన్ విలనీ బాగా పండింది. దీంతో పాటు జాకీష్రాఫ్‌ ఉంటే సినిమా ఫ్లాప్ అనే సెంటిమ�