మే 10న రాబోతున్న నారా రోహిత్ ‘ప్రతినిధి 2’

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఇప్పుడు మరింత వేడెక్కింది. ఇలాంటి తరుణంలో థియేటర్లలోకి రాబోతున్న అసలు సిసలు పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి 2’. ఇప్పటికే మంచి విజయాన్ని సాధించిన ‘ప్రతినిధి’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. దాదాపు ఆరు సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత నారా రోహిత్ నటించిన చిత్రం ‘ప్రతినిధి 2’. పాపులర్ జర్నలిస్ట్ మూర్తి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రమిది.

కాంటెంపరరీ పాలిటిక్స్ ను ప్రస్తావిస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో రోహిత్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ‘ప్రతినిధి 2’పై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే.. ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకు రావాల్సిన ‘ప్రతినిధి 2’ అనివార్య కారణాలతో వాయిదా పడింది. లేటెస్ట్ గా మే 10న ‘ప్రతినిధి 2’ విడుదల తేదీ ఖరారు చేసుకుంది.

Related Posts