మాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి

గతంలో ఎప్పుడూ లేనివిధంగా మలయాళం నుంచి చాలా తక్కువ సమయంలో నాలుగు బ్లాక్‌బస్టర్స్ వచ్చాయి. ఆ చిత్రాలే ‘ప్రేమలు, ది గోట్ లైఫ్, మంజుమ్మల్ బాయ్స్, ఆవేశం’. వీటిలో ‘ఆవేశం’ తప్ప మిగతా సినిమాలు తెలుగులోనూ అనువాద రూపంలో అలరించాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ సినిమాలన్నీ ఓటీటీ కి క్యూ కడుతున్నాయి.

ఇప్పటికే ‘ప్రేమలు’ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ మొదలైంది. ఏప్రిల్ 12 నుంచే ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చేసింది. ఇక.. మే 5 నుంచి ‘మంజుమ్మల్ బాయ్స్’ స్ట్రీమింగ్ మొదలవుతోంది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా పలు భాషల్లో అందుబాటులోకి వస్తోంది. మరో మలయాళం చిత్రం ‘ది గోట్ లైఫ్’ మే 10 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ.. ఫహాద్ ఫాజిల్ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ మే 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి.

Related Posts