వరుణ్ – లావణ్య డెస్టినేషన్ మ్యారేజ్

టాలీవుడ్ లో మరో స్టార్ కపుల్ మ్యారేజ్ కు టైమ్ వచ్చేసింది. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేసుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల పెళ్లికి బాజాలు మోగబోతున్నాయి.

కొన్నాళ్లు ఇండస్ట్రీలో జరుగుతున్న పెళ్లిళ్లన్నీ డెస్టినేషన్ మ్యారేజ్ లే. అయితే గోవా.. లేదంటే జైపూర్ అంటూ హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ లో ముఖ్యమైన వారి వరకూ వెళ్లి పెళ్లి చేసుకుని వస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ పెట్టి అయిన వారందరినీ ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ – లావణ్య కూడా అదే చేయబోతున్నారు. అయితే వీరు తాము మొదటి సారి ఎక్కడ ప్రేమలో పడ్డారో అక్కడే పెళ్లీ చేసుకోబోతున్నారు.


యస్.. ఈ ఇద్దరూ కలిసి ఫస్ట్ టైమ్ మిస్టర్ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతున్నప్పుడే ప్రేమలో పడ్డారు. అప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అలా తమ ప్రేమకు పునాది అయిన ఇటలీలో మూడుముళ్లు వేసుకుంటే ఆరు కాలాల పాటు ఆనందంగా ఉంటాము అని నమ్ముతున్నారు.

ఇక ఈ నవంబర్ లోనే వీరి పెళ్లి జరగబోతోందనే వార్తలున్నాయి.ఇంతకు ముందు ఇండియా నుంచి సెలబ్రిటీస్ లో విరాటో కోహ్లీ – అనుష్కశర్మ, రణ్ వీర్ సింగ్ – దీపికా పదుకోణ్ లు కూడా ఇటలీలోనే డెస్టినేషన్ మ్యారేజెస్ చేసుకున్నారు.


మరి పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ అంతేగా అంతేగా హజ్బెండ్ లా ఉంటాడా లేక ఆల్వేస్ హ్యాపీ హజ్బెండ్ అవుతాడా అనేది చూడాలి.

Related Posts