బ్రో ట్రైలర్ వచ్చింది. మామూలుగా రీమేక్ సినిమాలంటే పెద్దగా ఆసక్తి చూపించడం లేదు జనాలు. ముఖ్యంగా పవన్ ఈ మధ్య ఎక్కువగా రీమేక్ లు చేస్తున్నాడు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ అలా వచ్చినవే. కానీ ఇందులో అభిమానులు కోరుకుటున్న పవన్ కనిపించడం లేదు. ఈ విషయంలో వాళ్లు కాస్త అసంతృప్తిగా ఉన్నారు.
ఈ టైమ్ లో మరో రీమేక్ అంటే ఆ ఏముంటుందిలే అనుకున్నారు. బట్ ఇది అలా కాదు అని ట్రైలర్ చూసిన తర్వాత అర్థమౌతుంది. సముద్రఖని దర్వకత్వంలో వినోదాయ సీతమ్ అంటూ కేవలం గంట పదిహేను నిమిషాల నిడివితో వచ్చిన సినిమాను తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో మలిచాడు. తను స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశాడు. పవన్ కళ్యాణ్, సాయితేజ్ వంటి స్టార్స్ యాడ్ అవడంతో ఈ ప్రాజెక్ట్ కు భారీ హైప్ వస్తుందనుకుంటే ఆశ్చర్యంగా రాలేదు.
తమన్ సంగీతం అందించగా వచ్చిన రెండు పాటలు సైతం అస్సలు ఆకట్టుకోలేదు.దీంతో ఈ నెల 28నే విడుదల కాబోతోన్న ఈ మూవీపై అస్సలు బజ్ లేదు. ఈ టైమ్ లో విడుదలైన ట్రైలర్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటి వరకూ వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ కాస్త నీరసంగా ఉన్నాయి. బట్ ఈ సారి ఆయన డబుల్ జోష్ తో కనిపిస్తున్నాడు. చేసేది దేవుడి పాత్రే అయినా.. ఎనర్జీ లెవల్స్ వేరే కనిపిస్తున్నాయి.
ఏదో సాఫ్ట్ గా నీరసంగా ఉంటాడు అనుకుంటే ఆయన పాత్రను అద్భుతంగా డిజైన్ చేశాడు త్రివిక్రమ్. పైగా డిఫరెంట్ గెటప్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే పవన్ సందర్భానికి తగ్గట్టుగా తన రూపం మార్చుకుంటాడు అన్నమాట. అలా ఒక సీన్ కోసం ఏకంగా ఒకే రోజు పది పదిహేను గెటప్స్ కూడా వేశాడుఅని చెప్పాడు సముద్రఖని. ఇక ట్రైలర్ చివర్లో తన జల్సా సినిమాలోని పాటకు తనే డ్యాన్స్ వేస్తున్న విజువల్ ఉంది. అలాంటి సీన్ కు థియేటర్స్ లో మామూలు విజిల్స్ పడవు. ఇటు మామా అల్లుళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా బలే కుదిరినట్టు కనిపిస్తోంది. కొన్నిసార్లు రియల్ లైఫ్ రిలేషన్స్ సినిమాలకు వర్కవుట్ కావు. కానీ వీరి విషయంలో అయింది అనిపిస్తోందిట్రైలర్.
సముద్రఖని గత ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే.. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ గానూ ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ లో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ.. సెకండ్ హాఫ్ లో తను చెప్పాలనుకున్న పాయింట్ ను ఎమోషన్స్ ను మిక్స్ చేసి చెప్పబోతున్నాడు. మొత్తంగా ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రామిసింగ్ గానూ.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమాగానూ కనిపిస్తోంది. అన్నిటికి మించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం చాలా రోజుల తర్వాత ఆయన రియల్ ఎనర్జీ కనిపిస్తుంది అనిపిస్తోంది.