ఈ సారి కొట్టాల్సిందే వరుణ్

వరుణ్ తేజ్.. ఇలా ఫామ్ లోకి వచ్చినట్టే అనిపిస్తాడు అలా జారిపోతుంటాడు.గద్దలకొండ గణేష్ తో తనలోని ఊరమాస్ యాంగిల్ ను చూపించిన వరుణ్ వెంటనే ఎఫ్2తో కామెడీ యాంగిల్ చూపించాడు. ఈ రెండూ బ్లాక్ బస్టర్స్. బట్ తర్వాత వచ్చిన గని మాత్రం ఊర డిజాస్టర్. అస్సలే మాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ మూవీ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఇక ఎఫ్3 తో హిట్ అనిపించుకున్నా ఇదేమంత పెద్ద సౌండ్ చేయలేదు.

ఇక ఇప్పుడు గాండీవధారి అర్జున అంటూ వస్తున్నాడు. దాదాపు విదేశాల్లోనే చిత్రీకరణ జరుపుకుందీ చిత్రం. ఎస్సే అనే ఓ ఇంటర్నేషనల్ ఏజెన్సీలో సెక్యూరిటీ వింగ్ లో పనిచేసే వ్యక్తి కథ అంటున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఇలాంటివి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. తెలిసేలా ఇంట్రెస్టింగ్ గా కథ, కథనం ఉంటే ఖచ్చితంగా హిట్ చేస్తారు మనవాళ్లు.


ప్రవీణ్ సత్తారు సినిమా అంటే ఒక అంచనా ఇప్పటికే ఉంది. ఏ కంటెంట్ తీసుకున్నా దాన్ని తనదైన శైలిలో ప్రెజెంట్ చేస్తాడు. గరుడవేగ సినిమాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో చూపించాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్ సినిమానే తీశాడు అంటే ఖచ్చితంగా నెక్ట్స్ లెవల్ లో ఎంటర్టైన్ చేస్తాడు అనుకోవచ్చు. ప్రవీణ్ సత్తారు సినిమాల్లో అనవసర విషయాలు ఉండవు. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం పెట్టే పాటలు, కామెడీ ట్రాకులు, లేక ఇతర అంశాలు వంటివి కథకు అవసరమైతే తప్ప కనిపించవు. ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు కూడా అదే అనిపించింది. గాండీవధారిలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది. రెండు పాటలు మాంటేజ్ గా వినిపిస్తాయి అని చెప్పాడు. అంటే కథపైనే గట్టిగా ఫోకస్ చేశారు అనుకోవచ్చు.


ఇక ఇంటర్నేషనల్ సెక్యూరిటీ గార్డ్ గా వరుణ్ తేజ్ ఈ పాత్రకు బాగా ఫిట్ అయినట్టు కనిపిస్తున్నాడు. హీరోయిన్ సాక్షి వైద్య సైతం అదే తరహా పాత్రలో కనిపిస్తోంది. ఈ ఇద్దరికీ మంచి ప్రాధాన్యమే ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తంగా ఈ మూవీతో వరుణ్ తేజ్ మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలి. తను కెరీర్ లో చేస్తోన్న ఈ వైవిధ్యమైన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలి. లేదంటే కెరీరే ప్రమాదంలో పడుతుంది అని చెప్పలేం. బట్ ఓ కొత్త ప్రయత్నం సక్సెస్ అయితే మరిన్ని కొత్త తరహా సినిమాలు చేస్తారు కదా అంతే.

Related Posts