బేబీ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలే పెద్ద విజయాలు సాధించాయి.ఇక కల్ట్ క్లాసిక్ అనే పెద్ద పేరు కూడా తగిలించుకున్న బేబీ సినిమా సాధించిన విజయం మాత్రం అనూహ్యం. రిలీజ్ కు ముందే పాటలు, టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ వేసిన ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని మేకర్స్ కూడా నమ్మి ఉండరు. కానీ ఎప్పుడు ఏ సినిమా ఎవరికి ఎలా కనెక్ట్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. సినిమాల్లో ఉండే మ్యాజిక్కే అది.ఆ మ్యాజిక్ క్రియేట్ చేసిన బేబీ ఏకంగా 100 కోట్ల వరకూ కొల్లగొట్టింది.


ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య,విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో క్యారెక్టర్స్ కూడా లిమిటెడ్ గానే ఉండటం విశేషం.నిర్మాత ఎస్కేఎన్ ఈ చిత్రాన్ని, దర్శకుడు సాయి రాజేశ్ ను ముందు నుంచీ బాగా నమ్మాడు అనేది అర్థం అవుతుంది. బలమైన రైటింగ్ మెయిన్ స్ట్రెంత్ గా వచ్చిన బేబీ యువతరాన్ని బాగా ఊపేసింది. అందుకే రిపీటెడ్ గా చూశారు.ఈ కాలంలో ఒక సినిమాను థియేటర్స్ లోనే రిపీటెడ్ గా చూస్తున్నారు అంటే అది ఎప్పుడు ఏ ఫార్మాట్ లో వచ్చినా మెప్పిస్తుందనే అర్థం.ఇక విడుదలై నెల దాటిన ఈ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 25నుంచి ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది బేబీ.


అయితే థియేటర్ లో హిట్ అయిన సినిమాలు ఓటిటిలో మాత్రం ఆకట్టుకోవడం లేదు. మరి ఆ ట్రెండ్ ను ఈ బేబీ బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts