కొండను ఢీ కొట్టబోతోన్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఈ టైటిల్ వినగానే అందరిలోనూ ఓ పాజిటివ్ లుక్ వచ్చింది. పైగా కాంబినేషన్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనుష్కశెట్టి, నవీన్ పోలిశెట్టి కలిసి నటిస్తున్నారు అన్నప్పుడు ఇదో క్రేజీ మూవీ అవుతుందని భావించారు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తోన్న ఆడియన్స్ పేషెన్సీతో ఆడుకుంటోంది యూవీ క్రియేషన్స్ బ్యానర్.

సమ్మర్ లో వస్తే బ్లాక్ బస్టర్ అయ్యేది అనుకున్నారు. వేసవిని మిస్ చేసుకుంది టీమ్. తర్వాత ఆగస్ట్ 4న అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తర్వాత అదీ పోయింది. అప్పటికే ఆడియన్స్ లో ఈ మూవీపై ఇంట్రెస్ట్ కూడా పోయింది. కొత్త డేట్ గా ఈ నెల 18 లేదా 25 అనుకున్నారు. కానీ ఆ టైమ్ లో కూడా రాకపోవచ్చు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ రెండూ సేఫ్ డేట్స్. పెద్ద సినిమాలు లేవు. ఉన్నవాటికి పోటీ ఇచ్చే సత్తా ఈ చిత్రానికి ఉంటుంది. అదీ కాదనుకుని ఏకంగా కొండనే ఢీ కొట్టేందుకు సిద్ధం అవుతున్నారు.


మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిన సెప్టెంబర్ 7న విడుదల చేయాలనుకుంటున్నారట. ఆ రోజు షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ ఉంది. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అంటే ఓ రకంగా కొండను ఢీ కొట్టబోతున్నట్టుగానే చెప్పాలి. డబ్బింగ్ సినిమానే అయినా అంచనాలు పీక్స్ లో ఉన్నప్పుడు ఓపెనింగ్స్ గ్రాండ్ గా ఉంటాయి. అదీ ఈ సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపిస్తుంది. దీంతో పాటు ఒక వారం ముందే ఖుషీ విడుదలవుతుంది.

ఈ మూవీకి హిట్ టాక్ వచ్చినా మిస్ అండ్ మిస్టర్ కు సమస్యే. ఏదేమైనా రిలీజ్ డేట్ విషయంలో ఈ మూవీ టీమ్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుందో కానీ.. ఈ సినిమాపై ఉన్న ఆసక్తి పూర్తిగా పోయిందనే చెబుతున్నారు చాలామంది. మరి ఇకనైనా ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటారేమో చూడాలి.

Related Posts