వినూత్నంగా ఉపేంద్ర కొత్త సినిమా టీజర్

బౌండరీస్ ను ఛేదించిన వాడే బెంచ్ మార్క్ లు సెట్ చేస్తాడు. అలాంటి వారిలో దక్షిణాది సినిమా పరిశ్రమలోని టాప్ పీపుల్ లో కనిపించే వ్యక్తి ఉపేంద్ర. దర్శకుడుగా మొదలైన నటుడుగా మారి అతను సృష్టించిన సంచలనాలకు ఒకప్పుడు సౌత్ సినిమా షేక్ అయింది. ముఖ్యంగా డైరెక్టర్ గా అతను రూపొందించిన ఓమ్ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఇండియన్ సినిమాల్లో ఎంతోమంది ఫాలో అయిన ఎన్నో షాట్స్ కు ఆద్యుడు అతను. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టాడు ఉపేంద్ర.


ఉపేంద్ర దర్శకత్వం చేస్తున్నాడంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాల్లో ఎవరూ చేయని సాహసంతో టీజర్ వదిలాడు. సాహసం అని ఎందుకన్నాం అంటే.. ఈ టీజర్ లో విజువల్ లేదు. పూర్తిగా చీకటి ఉంది. కొన్ని సౌండ్స్, కొన్ని డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ తరహా వినూత్నమైన ఆలోచనలు ఉపేంద్రకే వస్తాయి. అందుకు మరో ఉదాహరణే ఈ టీజర్ అనేలా ఉంది. పూర్తిగా చీకట్లోనే మొదలైన ఈ టీజర్ లో ” చీకటి .. అంతా చీకటి.. అసలిది ఎలాంటి చోటు.. నీళ్ల శబ్ధం వినపడుతోంది.. ఈ చీకటి నుంచి తప్పుంచుకోవటం ఎలా.. వెలుతురు పడ్డా.. అలికిడి విన్నా.. ఎటాక్ చేస్తారు.. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవటం ఎలా.. కామ్ గా ఆలోచించు.. కాన్ సెంట్రేట్.. ” ఇలా పూర్తి చీకట్లోనే డైలాగ్స్ వినిపిస్తుండగా.. ఒక్కో మాటకు ఒక్కో శబ్ధం వెలువడుతూ.. అది నీళ్ల శబ్ధం, కత్తి పోటు, అటాక్, హత్యా ప్రయత్నం, హాహాకారాలు, ఆకలి బాధలు, ఆర్తనాదాలు అని మనకు అర్థం అవుతూ ఉంటాయి. అదే దర్శకుడుగా ఉపేంద్ర బ్రిలియన్సీ.. అనిపిస్తుంది.


ఇక టీజర్ చివర్ లో మాత్రం ‘యూ’ అనే ఇంగ్లీష్ లెటర్ వచ్చేలా మధ్యలో ఒక జ్వాల వెలుగుతున్నట్టుగా కనిపించిన ఫ్రేమ్ మాత్రమే కలర్ లో ఉంది. దానికి ముందు “దిస్ ఈజ్ నాట్ ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) వరల్డ్.. దిస్ ఈజ్ యూఐ(ఉపేంద్ర ఇంటిలిజెన్స్) వరల్డ్.. టూ ఎస్కేప్.. యూజ్ యువర్ ఇంటలిజెన్స్” అనే డైలాగ్ వచ్చింది. ఇదీ చీకట్లోనే. మొత్తంగా ఉపేంద్ర మరోసారి ఓ సంచలన కథతో వస్తున్నాడనేది ఈ డార్క్ టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఏదమైనా అతని డేరే డేర్.

Related Posts