పూరీకి హీరోయిన్ దొరికింది

హీరోయిన్ల క్యారెక్టర్స్ ను డిఫరెంట్ గా డిజైన్ చేయడంలో పూరీ జగన్నాథ్ స్టైల్ వేరే ఉంటుంది. అఫ్ కోర్స్ అవి గౌరవ ప్రదంగా మాత్రం ఉండవు అనేదీ నిజం. గ్లామర్ తో నిండి వల్గర్ మాట్లాడే హీరోయిన్ల పాత్రలు సైతం రాశాడు పూరీ జగన్నాథ్. అయినా అతని సినిమాల్లో నటించిన బ్యూటీస్ ఫేట్స్ మారిపోయాయి. చాలా ఫ్లాపుల తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టాడు పూరీ. ఆ తర్వాత ఓ రేంజ్ లో హడావిడీ చేస్తూ ప్యాన్ ఇండియన్ సినిమా అంటూ చేసిన లైగర్ తో అభాసుపాలయ్యాడు. ఇది ఆల్ టైమ్ క్లాసిక్ డిజాస్టర్స్ లో చోటు సంపాదించుకుంది.

ఇక ఇప్పుడు మళ్లీ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అంటూ వస్తున్నాడు. రామ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఇప్పటి వరకూ ఈ చిత్రంలో హీరోయిన్ ఫైనల్ కాలేదు.


మామూలుగా పూరీ జగన్నాథ్ అన్ని ముందే సెట్ చేసుకుంటాడు. ఎందుకో ఈ డబుల్ ఇస్మార్ట్ లో హీరోయిన్ విషయంలో కాస్త ఆలస్యం చేశాడు. బట్ లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు ఓ హాట్ బ్యూటీ సెట్ చేసుకున్నాడు. అదే.. సినిమాలో తీసుకున్నాడు. నెపోకిడ్ గా ఎంటర్ అయి బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్లేస్ కోసం ప్రయత్నిస్తోన్న సారాఅలీఖాన్ డబుల్ ఇస్మార్ట్ లో డబుల్ డోస్ ఇవ్వబోతోంది. రామ్ సరసన హీరోయిన్ గా తనే ఫైనల్ అంటున్నారు. తను కూడా ఎస్ అనేసిందట. త్వరలోనే షూటింగ్ లో జాయిన్ కాబోతోంది.


అయితే పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన బాలీవుడ్ బ్యూటీస్ ఎవరికీ పెద్దగా లక్ కలిసి రాలేదు. కొన్నాళ్ల క్రితం లోఫర్ సినిమాతో దిశా పటానీని తెచ్చాడు. ఆ సినిమా డిజాస్టర్. లైగర్ తో అనన్య పాండేను సౌత్ కు పరిచయం చేశాడు. ఈ మూవీ ఏమైందో అందరికీ తెలుసు.ఇక ఇప్పుడు సారా అలీఖాన్. మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తూ సారాకు సాలిడ్ హిట్ పడుతుందా అనేది చూడాలి.

Related Posts