కాబోయే భార్యతో కలిసి వినాయక చవితి సెలబ్రేషన్స్

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. అంతకంటే ముందే తన కాబోయే భార్యను తన ఇంటికి తెచ్చేసుకున్నాడు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్న ఈ జంట నవంబర్ లో ఒక్కటి కాబోతోంది. రీసెంట్ గా లావణ్య లేకుండా తన ఫ్యామిలీతో కలిసి ఓ అబ్రాడ్ టూర్ వేసి వచ్చాడు వరుణ్ తేజ్. ఇక తాజాగా తన ఇంట్లో వినాయక చవితి పూజను గ్రాండ్ గా నిర్వహించుకున్నాడు. ఈ పూజా కార్యక్రమంలో ఈ కాబోయే జంటతో పాటు నాగబాబు దంపతులు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


వరుణ్ తేజ్, లావణ్య కలిసి రెండు సినిమాల్లో నటించారు. ఇవి మిస్టర్, అంతరిక్షం. ఈ రెండూ హిట్ కాలేదు కానీ.. ఈ ఇద్దరి మనసులు కలిసేలా చేశాయి. ముఖ్యంగా మిస్టర్ మూవీ షూటింగ్ కోసం యూరోప్ వెళ్లినప్పుడే వీరి మధ్య ప్రేమ మొగ్గ తొడగడం.. అది ప్రపోజల్ వరకూ వెళ్లి ఒప్పుకున్న తర్వాత ఫలించడం అన్నీ వేగంగా జరిగినా.. ఇతరులెవరికీ తెలియకుండా భలే జాగ్రత్త పడ్డారు. నిజానికి సినిమా పరిశ్రమల్లో ఎఫైర్స్ దాగడం, దాచడం అంత సులువు కాదు. ఈ విషయంలో వీళ్లు సూపర్ హిట్ అనిపించుకున్నారు.

ఎంగేజ్మెంట్ కు కేవలం కొన్ని రోజుల ముందే వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. అప్పుడే చాలామంది ఇండస్ట్రీ వాల్లు కూడా ఆశ్చర్యపోయారు. మొత్తంగా పెళ్లికి ముందే కాబోయే భార్యకు తన కుటుంబం గురించిన విషయాలన్నీ తెలియజేస్తున్నాడు వరుణ్‌. ఇక ఈ పిక్స్ చూస్తుంటే అత్తా కోడళ్ల మధ్య కూడా మంచి కెమిస్ట్రీ కుదిరినట్టు కనిపిస్తోంది. కాకపోతే ఈ పండగలో నిహారిక మాత్రం మిస్ అయింది.

Related Posts