అన్ స్టాపబుల్‘ వైల్డెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ ‘అన్ స్టాపబుల్‘ లిమిటెడ్ ఎడిషన్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది. లేటెస్ట్ ఎపిసోడ్ లో ‘యానిమల్‘ మూవీ టీమ్ సందడి చేసింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో పాటు.. హీరోహీరోయిన్లు రణ్ బీర్ కపూర్, రష్మిక.. ‘అన్ స్టాపబుల్‘ షో లో పాల్గొన్నారు. ఈ వైల్డెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజయ్యింది.

నటసింహం నెవర్ బిఫోర్ హోస్టింగ్ తో ఈ ఎపిసోడ్ ఫుల్ పైసా వసూల్ ట్రీట్ లా ఉండబోతున్నట్టు ప్రోమోని చూస్తే అర్థమవుతోంది. ముందుగా డైరెక్టర్ సందీప్ రెడ్డితో ప్రారంభమైన ఈ ఎపిసోడ్ లో.. ఆ తర్వాత రణ్ బీర్, రష్మిక ఎంట్రీ ఇచ్చారు. ఇక.. రణ్ బీర్ కపూర్ ని ఎంతో సాదరంగా ఆహ్వానించిన బాలయ్య.. రష్మికను తనదైన రొమాంటిక్ స్టైల్ లో ‘నా మనసు బ్యాలెన్స్ లో లేదిక.. ఎందుకో మైండ్ అంతా తికమక.. వచ్చేయమ్మా రష్మిక‘ అంటూ ఆహ్వానించాడు నటసింహం.

తన హాస్య చతురతతో సందీప్ రెడ్డి వంగాని తికమక పెట్టిన బాలయ్య.. రణ్ బీర్ కపూర్ తో తెలుగు డైలాగులు చెప్పించాడు. ‘ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు..‘ అంటూ రణ్ బీర్ చెప్పిన డైలాగ్ ప్రోమోలో ఆకట్టుకుంటుంది. ఇక.. ‘పైసా వసూల్‘ టైటిల్ సాంగ్ కి బాలకృష్ణ, రణ్ బీర్ వేసిన స్టెప్పులు ఈ ప్రోమోకే హైలైట్. నవంబర్ 24 నుంచి ఆహా లో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

Related Posts