ప్రెజెంట్ టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈ మాటల మాంత్రికుడు ఎక్కువగా పవన్, మహేష్, అల్లు అర్జున్ లతోనే సినిమాలు చేశాడు. అయితే.. ఈయనతో వర్క్ చేయాలనుకుంటోన్న స్టార్స్ లిస్ట్ భారీగానే ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్ ఎప్పట్నుంచో త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తారనే ప్రచారం ఉంది. అలాగే.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో త్రివిక్రమ్ డైరెక్షన్ లో మల్టీస్టారర్ చేస్తానని గతంలో సుబ్బిరామి రెడ్డి ప్రకటించాడు కూడా. ఆ కాంబోస్ ని పక్కనపెడితే ఇప్పుడు లేటెస్ట్ గా త్రివిక్రమ్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ చేస్తాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
గత కొన్నేళ్లుగా ఎక్కువగా యాక్షన్ మూవీస్ కే పరిమితమైన ప్రభాస్ కి.. ఓ ఫక్తు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలనుందట. అది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో. అంతే.. వీరిద్దరి కాంబోని సెట్ చేయడానికి యు.వి.క్రియేషన్స్ ముందుకొచ్చిందట. దీనికి తోడు త్రివిక్రమ్ తరపు నుంచి హారిక అండ్ హాసిని ఉంది. ఈ రెండు నిర్మాణ సంస్థలు ఈ క్రేజీ కాంబో మూవీని సెట్ చేయబోతున్నాయనేదే ఆ వార్తల సారాంశం.
అయితే.. ప్రభాస్-త్రివిక్రమ్ కాంబో మూవీ సెట్ అవ్వడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘సలార్’ను రిలీజ్ కు రెడీ చేసిన ప్రభాస్.. ఆ తర్వాత ‘కల్కి 2898 ఎ.డి’, మారుతి సినిమాలను పూర్తిచేయాల్సి ఉంది. ఇంకా.. సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ కూడా లైన్లో ఉంది. మరోవైపు ‘గుంటూరు కారం’ పూర్తైన వెంటనే అల్లు అర్జున్ తో కొత్త సినిమాని పట్టాలెక్కించనున్నాడు త్రివిక్రమ్. అలా.. వీరిద్దరి ప్రయర్ కమిట్ మెంట్స్ పూర్తైన తర్వాతే ఈ రేర్ కాంబో సెట్ అయ్యే అవకాశాలున్నాయి.