మరోసారి రిస్క్ చేస్తున్న అఖిల్

అన్నయ్య నాగచైతన్య మీడియం రేంజ్ బడ్జెట్ లో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ పై ఫోకస్ పెడుతుంటే.. అఖిల్ మాత్రం తన టార్గెట్ పెద్దది అంటున్నాడు. ఈ ఏడాది ఎన్నో అంచనాలతో వచ్చిన ‘ఏజెంట్‘ డిజాస్టర్ గా మిగిలింది. అయినా.. అఖిల్ లో ఏమాత్రం మార్పు రాలేదు.

మరోసారి ఓ భారీ బడ్జెట్ సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఎక్కువగా డ్యాన్సులు, ఫైట్స్ లకు ప్రిఫరెన్స్ ఇస్తున్న ఈ యంగ్ హీరో మరోసారి అలాంటి తరహా సినిమాతోనే రాబోతున్నాడట. యు.వి.క్రియేషన్స్ నిర్మాణంలో రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాకి సిద్ధమవుతున్నాడట.

‘సాహో‘ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్ కుమార్ అనే న్యూ డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడట. ప్రస్తుతం అఖిల్ న్యూ మూవీకి సంబంధించి ప్రి ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట.

Related Posts