శ్రీసత్య కి అన్యాయం చేసిన ‘టిల్లు స్క్వేర్‘ టీమ్?

రెండున్నర గంటల సినిమాకోసం కొన్ని గంటల ఫుటేజ్ ను చిత్రీకరిస్తుంటారు డైరెక్టర్స్. దీంతో.. ఫైనల్ అవుట్ పుట్ లో వాటిలో ఏ ఏ సన్నివేశాలు ఉంటాయో అనేది వాళ్లకే కన్ఫ్యూజన్. ఈకోవలోనే కొంతమంది నటీనటుల సన్నివేశాలు కూడా ఎగిరిపోతుంటాయి. లేటెస్ట్ గా ‘టిల్లు స్క్వేర్‘తో అలాంటి అనుభవమే ఎదురయ్యిందట ‘బిగ్ బాస్‘ బ్యూటీ శ్రీసత్యకి.

‘బిగ్ బాస్‘కి వెళ్లక ముందు అంతగా పరిచయం లేని శ్రీసత్య.. ఆ హౌస్ లో అందమైన అమ్మాయిగా.. చలాకీతనంతో ఆకట్టుకుంటుంది. ‘బిగ్ బాస్‘ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ లు, సినిమాలు అంటూ మనసుకి నచ్చిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ సాగుతోంది. ఈ లిస్టులో ‘టిల్లు స్క్వేర్‘ కూడా ఉంది. ‘టిల్లు స్క్వేర్‘లో ఓ ప్రాధాన్యత గల పాత్రలో నటిస్తున్నానని ఆమధ్య పలు ఇంటర్యూలలో తెలిపింది శ్రీసత్య. కానీ.. ఫైనల్ గా సినిమా రిలీజైన తర్వాత ఆమె పాత్ర మొత్తం కట్ అయిపోయినట్టు తెలుస్తోంది. కేవలం ఒక పాటలో చిన్న మెరుపులా మెరిస్తుంది అంతే. మొత్తంమీద.. ఈ విషయంలో ‘టిల్లు స్క్వేర్‘ టీమ్ శ్రీ సత్యకి అన్యాయం చేశారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related Posts