ఒకే ఫ్రేములో ఇద్దరు గ్లోబల్ స్టార్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముంబైలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ముంబైలోని సిద్ధివినాయక టెంపుల్ ని సందర్శించిన చరణ్ అక్కడ అయ్యప్ప మాలను విరమించినట్టు తెలస్తోంది.

అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా క్రికెటర్ ధోని, రామ్ చరణ్ కలుసున్న ఫోటోస్ ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ఇండియన్ క్రికెట్ దిగ్గజం ధోని.. భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలుసుకోవడం వెనుక ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వీరిద్దరూ కలిసి ఒక అడ్వర్ టైజ్ మెంట్ లో నటిస్తుండడమే.

అసలు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కాకముందే ఇండియన్ క్రికెటర్ ధోని తో కలిసి గతంలో ఓ పెప్సీ యాడ్ లో నటించాడు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి ఓ యాడ్ లో నటించబోతున్నారట. అయితే ఆ యాడ్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Related Posts