గుంటూరు కారం.. ప్రారంభమైన దగ్గర్నుంచీ ఎప్పుడూ హాట్ హాట్ గానే న్యూస్ లో ఉంటోంది. టైటిల్ కు తగ్గట్టుగా ఎప్పుడూ ఈ సినిమా గురించి ఘాటైన వార్తలే వస్తున్నాయి. మహేష్ బాబు షూటింగ్ కు సరిగా అటెండ్ కావడం లేదు అనే దగ్గర్నుంచీ ఆయన వల్లే కొందరు టెక్నీషియన్స్, ఆర్టిస్టులు తప్పుకున్నారు అనే వరకూ వెళ్లింది వ్యవహారం. బట్ ఏదైనా బెస్ట్ అవుట్ పుట్ కోసమే కదా అనేది ఆయన టీమ్ నుంచి వస్తోన్న స్పందన.
ఇక ఈ నెల 9న మహేష్ బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్ ను విడుదల చేయాలనుకుంది టీమ్. అందుకోసం తమన్ తో ట్యూన్స్ చేయించారు. అవేవీ మహేష్ బాబుకు నచ్చలేదు అని టాక్. దీంతో సంగీత దర్శకుడిని కూడా మారుస్తున్నారు అనే న్యూస్ వచ్చాయా మధ్య. బట్ త్రివిక్రమ్ కలగజేసుకుని మహేష్ ను ఒప్పించాడు. ఆ మేరకు తమన్ ప్రాజెక్ట్ లోనే ఉన్నాడు.
ఇక ఇన్ని చిరాకుల మధ్య తమన్ గతంలో చేసిన ట్యూన్స్ కాదని కొత్త గా ఓ ట్యూన్ చేశాడు. అది త్రివిక్రమ్ తో పాటు అందరికీ నచ్చిందట. అయినా మహేష్ బాబు ఫైనల్ చేయాలి. అతనికి నచ్చితేనే అది విడుదలవుతుంది. లేదంటే పాట ఆగిపోవడంతో పాటు తమన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటాడు అనే ప్రచారం జరుగుతోంది.
నిజానికి ఒకటీ రెండు ట్యూన్స్ యావరేజ్ గా ఉన్నా నష్టమేం లేదు. కాంబినేషన్ కు క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ లోకొన్ని మైనస్ కవర్ అవుతాయి. అయినా హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ నే కోరుకుంటే అది తమనే కాదు.. మహేష్ బాబు కూడా ఇవ్వలేడు. అంచేత ఈ సారి ఈ ట్యూన్ ఓకే చేసుకుని ఒకవేళ నిజంగానే నచ్చలేదు అనుకుంటే ఆ తర్వాత మరింత బెస్ట్ వైపు వెళితే బెటర్.
మొత్తానికి మహేష్ బాబు బర్త్ డేకు ఈ పాట వస్తుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే హండ్రెడ్ పర్సెంట్ విడుదలయ్యే అవకావం ఉందనే చెబుతున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ వెకేషన్ లోఉన్నాడు. అతను ట్యూన్ ను అక్కడి నుంచే ఫైనల్ చేస్తాడు. ఆ తర్వాతే సందడి మొదలవుతుంది. అదీ మేటర్.
No matter how many heroes we have, there are only a few who have reached…
Elections are going to be held in two Telugu states tomorrow (May 13). While elections…
Most Awaiting Movie 'Double Ismart' Starring Energetic Star Ram. This movie is being made as…
మనకు ఎంతమంది హీరోలున్నా.. నటనలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్…
రేపు (మే 13న) రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటుకి ఎన్నికలు జరుగుతుండగా.. తెలంగాణలో…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్‘. ఇప్పటికే సూపర్ డూపర్ హిట్టైన ‘ఇస్మార్ట్ శంకర్‘కి…